Laila Trailer: విశ్వక్ సేన్ ‘లైలా’ ట్రైలర్ వచ్చేసింది – లేడీ గెటప్‌లో ఆకట్టుకున్న మాస్ కా దాస్, ట్రైలర్ చూశారా?
![Laila Trailer: విశ్వక్ సేన్ ‘లైలా’ ట్రైలర్ వచ్చేసింది – లేడీ గెటప్‌లో ఆకట్టుకున్న మాస్ కా దాస్, ట్రైలర్ చూశారా?](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/laila-traier.jpg)
Vishwak Sen Laila Official Trailer: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎప్పుడు మాస్, యాక్షన్‌తో అలరించే విశ్వక్ సేన్ మొదటి ఈ చిత్రంలో లేడీ గెటప్‌తో ప్రయోగం చేశాడు. టీజర్‌లో విశ్‌వక్ సేన్ లేడీ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఈ మూవీపై విపరీతమైన బజ్ నెలకొంది. మూవీ ప్రమోషన్స్‌లోనూ విశ్వక్ లేడీ గెటప్ గురించే చర్చిస్తున్నారు. ఈ క్రమంలో లైలా మూవీపై రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీం ట్రైలర్ రిలీజ్ చేసింది. తాజాగా విడుదలైన లైలా ట్రైలర్ వినోదాత్మకంగా సాగింది. ఇందులో విశ్వక్ లేడీ గెటప్ రోల్‌కి ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. మొదటి నుంచి ఎండ్ వరకు ఈ నవ్వులు పూయిస్తూనే ఉంది. దీంతో ట్రైలర్‌తో మూవీపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. కాగా ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై నిర్మించారు. ఇందులో విశ్వక్ సేన్ మేల్ బ్యూటిషియన్ సోను మోడల్‌గా , లైలాగా రెండు విభిన్న పాత్రలతో అలరించబోతున్నాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్‌లో ఈ సినిమా థియేటర్లో విడుదల కాబోతోంది.