Laila OTT: మూడు వారాలకే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘లైలా’ – స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే!

Vishwak Sen Laila Locks OTT Release Date: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లైలా’ (Laila OTT) మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లో రిలీజైన ఈ సినిమా తొలి షోకే డిజాస్టర్ టాక్ అందుకుంది. ఇందులో విశ్వక్ సేన్ సోనూ మోడల్ అనే సెలూన్ బాయ్ పాత్రలో కనిపించాడు.
మరోవైపు లైలాగా లేడీ గెటప్లోనూ ఆకట్టుకున్నాడు. ఇందులో విశ్వక్ సేన్ నటనతో తప్పే మరేది ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా లేదు. ఇలాంటి స్టోరీస్‌లో గతంలో ఎన్నో వచ్చాయని, కథ కొత్త దనంలో లేదని నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. ముఖ్యంగా ఇందులో కామెడీ సీన్స్ క్రించ్ ఫీలింగ్ ఇచ్చాయి. నెగిటివ్ రివ్యస్ రావడంతో థియేటర్లకు ఆడియన్స్ కరువయ్యారు. దీంతో మూవీ ఘోర పరాజయం పొందింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది.
తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. లైలాను ఓటీటీ రైట్స్ ఆహా సొంతం చేసుకుంది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా బోల్తా కొట్టడంతో మూడు వారాల్లోనే చిత్రాన్ని ఓటీటీకి తీసుకువస్తున్నారు. మార్చి 7న లైలాను స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నట్టు తాజాగా ఆహా టీం పోస్టర్ రిలీజ్ చేసి అధికారిక ప్రకటన ఇచ్చింది. లైలా రిజల్ట్‌తో విశ్వక్ సేన్ దిగివచ్చాడు. ఇకపై తాను ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పనని, అందరి మెప్పించేలా ఉండే కథల తీస్తానన్నాడు. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ ప్రస్తుంత జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ డైరెక్షన్లో ఫంకీ అనే సినిమా చేస్తున్నాడు.