Vishnupriya Bhimeneni: కాలమే సమాధానం చెబుతుంది – పోలీసుల విచారణ తర్వాత విష్ణుప్రియ షాకింగ్ పోస్ట్

Vishnupriya Bhimeneni Shared a Shocking Post: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌ని పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. దీంతో యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న వారిపై జులుం విధిస్తుంది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ వ్యవహరం సంచలనంగా మారింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కి పాల్పడిన సినీ,టీవీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లపై కేసులు నమోదు చేసింది.
25 మందిపై కేసు
ఇందులో బిగ్‌బాస్ ఫేం, యాంకర్ విష్ణుప్రియ, రితూ చౌదరి, టెస్టీ తేజ, యూట్యూబర్ హర్షసాయి, సన్నీ యాదవ్, సిరి హనుమంతు, యాంకర్ శ్యామలతో.. ఇక టాలీవుడ్ హీరోలు రానా, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్, మంచు లక్ష్మితో పాటు మొత్తం 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే విష్ణుప్రియ, రితూ చౌదరిలతో పాటు పలువురిని ఈ కేసులో పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో గురువారం విష్ణుప్రియ, రితూ చౌదరిలు విచారణకు హాజరయ్యారు. విష్ణుప్రియా దాదాపు రెండు గంటల పాటు విచారించారు.
కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది
విచారణలో బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసినట్టు ఒప్పుకుంది. అంతేకాదు తాను దాదాపు 15 బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసినట్టు పోలీసులకు తెలిపింది. పోలీసు స్టేషన్‌కి వచ్చేటప్పుడు ముఖం మొత్తం కప్పేసుకుని మీడియా అసలు మాట్లాడనేలేదు. కానీ, విచారణ ముగిసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ‘కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది. అప్పటి వరకు ఓర్పుతో ఉండటమే’ అంటూ ఓ పోస్ట్ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్టు విచారణలో ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ఇలాంటి పోస్ట్ దేనికోసం పెట్టినట్టు? తన తప్పుని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది అంటూ అంటున్నారు.
ఏదేమైన ఆమె పోస్ట్ చూస్తుంటే ఈ కేసులో ఏదోకటి తేలే వరకు తను నోరు మెదపనని విష్ణుప్రియ చెప్పకనే చెప్పిందంటున్నారు. గురువారం విష్ణు ప్రియ సుమారు 10 గంటల ప్రాంతంలో పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరైంది. ఈ సందర్భంగా పోలీసు ఆమెను రెండు నుంచి మూడు గంటల పాటు విచారించినట్టు తెలుస్తోంది. ఇందులో ఆమె మూడు యాప్స్ మాత్రమే ప్రమోట్ చేశానని చెప్పగా.. 15 యాప్స్ ప్రమోట్ చేసినట్టు తమ వద్ద వీడియోలు ఉన్నాయని పోలీసుల అన్నారు. అలాగే ఈ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా తను ఎంత సంపాదించింది, ఎంత తీసుకుందనే నేపథ్యంలో కూడా ఆరా తీశారు. అంతేకాదు ఆమె ఫోన్ సీజ్ చేసినట్టు కూడా సమాచారం.