Last Updated:

Kushi Movie : విజయ్ దేవరకొండ – సమంత “ఖుషి” రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

టాలీవుడ్ లోకి “పెళ్లి చూపులు” అనే చిత్రంతో హీరోగా విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చి…”అర్జున్ రెడ్డి” సినిమాతో యువతలో మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ రౌడి హీరో కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ చూస్తే మతిపోతుంది. మనోడికి కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అదిరిపోయే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు

Kushi Movie : విజయ్ దేవరకొండ – సమంత “ఖుషి” రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Kushi Movie : టాలీవుడ్ లోకి “పెళ్లి చూపులు” అనే చిత్రంతో హీరోగా విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చి…”అర్జున్ రెడ్డి” సినిమాతో యువతలో మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ రౌడి హీరో కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ చూస్తే మతిపోతుంది. మనోడికి కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అదిరిపోయే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా విజయ్ పై క్రష్ ఉందని.. తనతో నటించాలని ఉందంటూ మనసులోని మాటల్ని బయటపెట్టారు. కాగా ఈ క్రేజీ హీరో ఇటీవల లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో శివ దర్శకత్వం వహించిన మజిలీ సినిమాలో సామ్ నటించిన విషయం తెలిసిందే. మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత సమంత అనారోగ్యానికి గురి కావడంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ ఇటీవలే సామ్ మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. డిఫరెంట్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అంతకు ముందు మహానటి చిత్రంలో విజయ్ – సామ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అను అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 1న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అందులో విజయ్ దేవరకొండను కశ్మీర్ కుర్రాడిగా, సమంతను సౌత్ అమ్మాయిగా చూపించారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిమీద ఉన్నాడు విజయ్. ఇందులో భాగంగానే మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి ప్లాన్ చేశారు. ప్రస్తుతం ‘ఖుషి’ షూటింగ్ భాగ్య నగరంలో జరుగుతోంది. ఇటీవల దుర్గం చెరువు సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో హీరో హీరోయిన్స్ విజయ్ దేవరకొండ, సమంత మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించారు.

 

 

మాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్, యువ సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వాహాబ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, ‘వెన్నెల’ కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు. గీతగోవిందం సినిమా తర్వాత విజయ్ ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయాడు. డియర్ కామ్రేడ్ సినిమా పర్లేదు అనిపించుకున్నా.. ఆ తర్వాత చేసిన సినిమాలు ఫ్యాన్స్ ను నిరాశ పరిచాయి. దాంతో ఇప్పుడు అర్జెంట్ గా విజయ్ కు హిట్ కావాలి అంటున్నారు ఫ్యాన్స్.