YSR Congress Party : వైకాపాకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉందిగా.. టీడీపీ లోకి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి !
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. దెబ్బ మీద దెబ్బ.. తగులుతూనే ఉంది. ఒక దెబ్బ నుంచి కొలుకునే లోపే మరోదెబ్బ కోలుకోకుండా చేస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అధికార పార్టీ నేతలు ఒకింత అయోమయానికి గురవుతుండగా.. సీఎం జగన్ తీవ్ర సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి..
YSR Congress Party : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. దెబ్బ మీద దెబ్బ.. తగులుతూనే ఉంది. ఒక దెబ్బ నుంచి కొలుకునే లోపే మరోదెబ్బ కోలుకోకుండా చేస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అధికార పార్టీ నేతలు ఒకింత అయోమయానికి గురవుతుండగా.. సీఎం జగన్ తీవ్ర సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి.. నిన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని షాక్.. నేడు తాజాగా వైసీపీ రెబల్ నేత కుటుంబ సభ్యుడు పార్టీ మార్పు.. ఈ ఘటనలు అన్నీ చూస్తుంటే జగన్ కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయని అనిపిస్తుంది.
కాగా తాజా సమాచారం ప్రకారం వైసీపీ రెబల్ నేత, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి ఈరోజు టీడీపీలో చేరనున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను టీడీపీలో చేరుతున్నానని, తనకు అంతా మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందరర్భంగా చంద్రబాబు , లోకేష్ ఫ్లెక్సీలను నగరమంతా ఏర్పాటు చేశారు. నెల్లూరులో భారీ ప్రదర్శన నిర్వహించి.. ఆ తరువాత అమరావతికి తరలివెళ్లేలా ఏర్పాట్లు చేశారు. రెండు గంటల తర్వాత చంద్రబాబు సమక్షంలో కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పార్టీ కండువాలు కప్పుకోనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేయడంతో పాటు పెద్ద ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
వైసీపీ నేత అయిన గిరిధర్‌రెడ్డి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడి గానూ పనిచేశారు. అయితే ఆయన సోదరుడైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గత కొంత కాలంగా వైసీసీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. తన ఫోన్ ట్యాప్ అయ్యిందంటూ ప్రభుత్వంతో పాటూ సొంత పార్టీపై ఆరోపణలు చేసి.. అధికార పార్టీకి రెబల్‌గా మారారు. ఈ క్రమంలో గిరిధర్ రెడ్డి కూడా సోదరుడి బాటలోనే నడిచినట్లు తెలుస్తుంది. దీంతో ఇటీవల గిరిధర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ అధిష్టానం. దీంతో ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే శ్రీధర్ రెడ్డి కూడా వైసీసీని వీడి టీడపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.
(YSR Congress Party) అనూహ్యంగా విజయం సాధించిన తెదేపా నేత పంచుమర్తి అనురాధ..
కాగా మరోవైపు నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్యంగా విజయం సాధించింది. ఆమెకు 23 ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి టీడీపీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో నలుగురు ఎన్నికల అనంతరం వైసీపీకి జై కొట్టారు. ఈ లెక్కన టీడీపీకి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 19 మాత్రమే. ఒకవేళ అధికార వైసీపీపై అసమ్మతి గళం వినిపించిన.. కోటంరెడ్డి, ఆనం.. టీడీపీకి ఓటు వేసినా.. ఆ పార్టీ బలం 21కి చేరుతుంది. కానీ అనూహ్యంగా టీడీపీ నుంచి పోటీ చేసిన పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు రావడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంచుమర్తి అనురాధ సాధించిన ఓట్లను మళ్లీ లెక్కించాలని కోరింది వైసీపీ. వైసీపీ విజ్ఞప్తితో అనురాధకు వచ్చిన ఓట్లను అధికారులు మళ్లీ లెక్కించారు. కానీ రీకౌంటింగ్ లోనూ ఆమె 23 ఓట్లు సాధించినట్లు వెల్లడైంది. ఓటింగ్‌కు ముందు 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు.