Last Updated:

Hanu-Man Teaser: ఆదిపురుష్ ను తలదన్నేలా “హను-మాన్” టీజర్.. ఆసక్తిరేపుతున్న మూవీ

ఇటీవల కాలంలో మూవీల ట్రెండ్ మారింది. ఆధ్యాత్మిక భావాలతో ఎక్కువగా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. కాగా తాజాగా తేజ సజ్జ హీరోగా హను మాన్ సినిమాను రూపొందించారు 'జాంబీ రెడ్డి' సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ. అయితే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.

Hanu-Man Teaser: ఆదిపురుష్ ను తలదన్నేలా “హను-మాన్” టీజర్.. ఆసక్తిరేపుతున్న మూవీ

Hanu-Man Teaser: ఇటీవల కాలంలో మూవీల ట్రెండ్ మారింది. ఆధ్యాత్మిక భావాలతో ఎక్కువగా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. కాగా తాజాగా తేజ సజ్జ హీరోగా హను మాన్ సినిమాను రూపొందించారు ‘జాంబీ రెడ్డి’ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ. సూపర్ హీరో కాన్సెప్టుతో తయారైన ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మించారు. కాగా ఈ మూవీలో కథానాయికగా అమృత అయ్యర్ మరో కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. టీజర్ను చూస్తే ఈ సినిమా అద్భుతమైన విజువల్స్ తో రానుందనే విషయం అర్థమవుతోంది.

కొండలు, లోయలు, జలపాతాలు, సముద్రగర్భం ఇలా ప్రకృతిని కూడా భాగం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించనున్నారనే విషయం స్పష్టమవుతోంది. హిమాలయాల్లో ధ్యానంలో ఉన్న హనుమంతుడు సినిమాలోని ఇతర ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ ఈ టీజర్ కట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. గౌరహరి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది.

ఇదీ చదవండి: నరేష్ కు తోడేలు బెడద.. ఈ వారం రానున్న సినిమాలు ఇవే..!

ఇవి కూడా చదవండి: