Published On:

Bindu Ghosh: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హాస్యనటి మృతి

Bindu Ghosh: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హాస్యనటి మృతి

Bindu Ghosh: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ హాస్యనటి బిందు ఘోష్(76) మరణించారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం మధ్యాహ్నం చెన్నెలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు నేడు చెన్నైలో ముగిసాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

 

తమిళ నటి అయిన బిందు ఘోష్ తెలుగులో కూడా మంచి మంచి సినిమాల్లో నటించారు. సూర్యకాంతంలా బొద్దుగా కనిపించే ఆమె..  కలతూర్ కన్నమ్మసినిమాతో ఆమె  వెండితెరకు పరిచయమైంది. ఆ తరువాత రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి పెద్ద పెద్ద స్టార్స్ తో నటించింది.  కొంబేరి మూకన్, మంగమ్మ సబతం, సూరకోట్టై సింగకుట్టి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో దొంగ కాపురం, పెళ్లి చేసి చూడు, చిత్రం భళారే విచిత్రం లాంటి సినిమాల్లో నటించింది.

 

ఇక బిందు ఘోష్ గుండె సంబంధిత వ్యాధితో పోరాడుతుండేది. ఈ విషయాన్నీ ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన కొడుకు.. తనకు చికిత్స చేయించలేక వదిలేసాడని, ఆర్థిక సహాయం చేయాలనీ ఇండస్ట్రీ వారిని కోరింది. ఆ సమయంలోనే నటుడు బాలా ఆమెకు వైద్య ఖర్చుల కోసం  80,000 ఇచ్చారు. ఆమె ఖర్చులన్నీ తాను చూసుకుంటానని కూడా ఆయన హామీ ఇచ్చారు. బాలాతో పాటు మరికొందరు కూడా బిందుకు ఆర్థిక సహాయం అందించారు. బిందు ఘోష్ మరణంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆమె మరణవార్త విన్న ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.