Betting App Case: ఏరక్కుపోయి చేశారు.. ఇరుక్కుపోయారు

Betting App Case: ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలా.. ? వచ్చే జీతం సరిపోవడం లేదా.. ? ఈజీగా మనీ కావాలా.. ? ఇదిగో ఇలా గేమ్ ఆడుతూ లక్షల్లో సంపాదించొచ్చు.. బెట్టింగ్ చెయ్.. డబ్బు కొట్టేయ్ అంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఊదగొట్టేశారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఎక్కువ ఇలాంటి వీడియోలే కనిపించేవి. ఇక సెలబ్రిటీలు చెప్పారు కదా చాలా మంది బెట్టింగ్ యాప్ లలో డబ్బులు పెట్టి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడమే కాక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో ఈ బెట్టింగ్ యాప్ లను ఎలాగైనా నివారించడానికి IAS వీసీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఎవరెవరు ప్రమోట్ చేశారు..
సెలబ్రిటీలు చాలామంది డబ్బు కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే కొన్ని యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. అసలు ఆ యాప్ ఏంటి.. ? దానివలన ఉపయోగం ఏంటి.. ? దాని వలన ప్రజలకు ఏదైనా హాని జరుగుతుందేమో అని ఆలోచించకుండా ప్రమోట్ చేస్తే డబ్బులు ఇస్తున్నారు కదా అని బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. అలా ఇప్పటివరకు ప్రమోట్ చేసినవారిలో.. యూట్యూబర్ హర్ష సాయి, విష్ణు ప్రియ, సుప్రీతా, టేస్టీ తేజ, రీతూ చౌదరి, అభయ్, భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్, సుధీర్ రాజు కిరణ్ గౌడ, యాంకర్ శ్యామల.. ఇలా మొత్తం 74 మంది ఉన్నారు.
వీసీ సజ్జనార్ కీలక నిర్ణయం
ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసారో వారందరిపై వీసీ సజ్జనార్ కేసులు నమోదు చేయడం సంచలనం గా మారింది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. రోజురోజుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పెరిగిపోవడంతో నిఘా పెట్టిన పోలీసులు.. కొంతమంది యూట్యూబర్స్, మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లుపై కేసు నమోదు చేసింది. యూట్యూబర్ హర్ష సాయి, విష్ణు ప్రియ, సుప్రీతా, టేస్టీ తేజ, రీతూ చౌదరి, అభయ్, భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్, సుధీర్ రాజు, కిరణ్ గౌడ తో సహా 11 మందిపై కేసులు నమోదు అయ్యాయి. త్వరలోనే వీరిని అరెస్ట్ చేయనున్నారని టాక్.
ఇక నుంచి సీరియస్ యాక్షన్
అమాయకులను మోసం చేసి వారి వీక్ నెస్ ను ఉపయోగించుకొని కోట్లు కొల్లగొడతాం అంటే ఇకనుంచి జరగని పని అని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్స్ మాత్రమే కాదు. పెద్ద పెద్ద స్టార్ హీరోస్.. షారుఖ్ ఖాన్, అనిల్ కపూర్, అల్లు శిరీష్, పూజా హెగ్డే లాంటి వారు కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసినవారిలో ఉన్నారు. వారందరికి కూడా ఎప్పటినుంచో పోలీసులు సమన్లు పంపిస్తూనే ఉన్నారు. కొందరు ఆ సమన్లుకు సమాధానం ఇవ్వగా.. ఇంకొందఋ సైలెంట్ గా సైడ్ అయ్యారు. ఇకనుంచి ఇలాంటివి జరిగితే సీరియస్ యాక్షన్ ఉంటుంది అని పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఎరక్కుపోయి ఇరుక్కుపోయారు.