Tamannaah: అప్పుడది ప్రేమ కాదు.. బిజినెస్ అవుతుంది – తమన్నా షాకింగ్ కామెంట్స్

Tamannaah About Love and Relationships: సింగిల్‌గా ఉన్నప్పుడు కంటే ప్రేమలో ఎక్కువ ఆనందంగా ఉన్నానంటుంది మిల్కీ బ్యూటీ తమన్నా. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఆమె చేసిన ఈ కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. కొన్ని రోజులుగా తమన్నా బ్రేకప్ రూమర్స్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. రెండేళ్లు నటుడు విజయ్ వర్మ రిలేషన్ ఉంది తమన్నా. మొన్నటివరకు వీరిద్దరు బి-టౌన్‌లో చట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ లవ్‌బర్డ్స్ బ్రేకప్ చెప్పుకున్నారనే గుసగుస వినిపిస్తోంది.
ప్రేమలో షరతులు ఉండోద్దు..
అయితే దీనిపై ఇప్పటి వరకు తమన్నా కానీ, విజయ్ వర్మ కానీ స్పందించలేదు. అయినా వారిద్దరు ప్రేమకు స్వస్తీ చెప్పి, మంచి స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా తమన్నా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ప్రేమపై స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. “ప్రేమకు రిలేషన్‌కు మధ్య తాడా ఉంది. ప్రేమ పుట్టాకే రిలేషన్ మొదలవుతుంది. ఆ ప్రేమ షరతులు లేకుండా ఉండాలి. కొన్ని సార్లు అది ఏకపక్షం కూడా కావచ్చు. అలాగే ప్రేమకు ఎలాంటి షరతులు కూడా ఉండకూడదు. ఇది కేవలం లవర్స్‌కి మాత్రమే వర్తించదు.
అప్పుడది బిజినెస్ అవుతుంది..
మీ పేరెంట్స్, ఫ్రెండ్స్, మన పెంపుడు జంతువులు ఇలా అన్నింటి ప్రేమకు వర్తిస్తుంది. నీ పార్ట్‌నర్‌పై అంచనాలు పెట్టుకోవడం ప్రారంభించావంటే అప్పుడా బంధం బిజినెస్ అవుతుంది. నేనిలా అనుకుంటే.. నువ్వు ఇలా చేశావ్! నువ్వు అది చేయ్యాలి, ఇది చేయ్యాలి ఆశిస్తే అది కేవలం వ్యాపార లావాదేవీగా మారుతుంది. మీ పార్ట్‌నర్ మీరు ప్రశ్నించడం మొదలు పెడితే ఇక పెద్ద లిస్టే తయారు చేసుకొవాల్సి వస్తుంది. అందుకు మనం ప్రేమించే వారిని స్వేచ్ఛగా ఉంచాలి. వారికి నచ్చినట్కటు బతకనివ్వాలి” అని చెప్పుకొచ్చింది.
రిలేషన్ లోనే సంతోషంగా ఉన్న..
అనంతరం తమన్నా మాట్లాడుతూ.. “నేను సింగిల్‌గా ఉన్నప్పటి కంటే రిలేషన్‌లోనే చాలా సంతోషంగా ఉన్నా. ఒక తొడు దొరికితే అంతకుమించిన ఆనందం ఉండదు. కానీ మనం ఎవరిని ఎంచుకున్నామన్నదే ముఖ్యం. ఎందుకంటే వారు మన జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా తెలివిగా పార్ట్‌నర్ ఎంచుకోవాలి. ఒకరిని నమ్మే ముందు మనల్ని మనం శోధించుకోవాలి. బాగా ఆలోచించాక ఆ రిలేషన్‌లో ముందడుకు వేయాలి” అని పేర్కొంది. తమన్నా వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమె తీరు చూస్తుంటే విజయ్ వర్మతో బ్రేకప్ అయినట్టుగా కనిపిస్తోందని అంతా అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఇంటర్య్వూలో తమన్నా తన బ్రేకప్ రూమర్స్‌పై మాత్రం స్పందించకపోవడం గమనార్హం.