Iran hangs three Israeli men: ఉరిశిక్షలు వేస్తున్న ఇరాన్ ప్రభుత్వం

Iran govt hangs suspected persons spying to israel: ఇజ్రాయెల్ -ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల ఒప్పందం కుదరింది. టెహరాన్‌లో పరిస్థితులు క్రమంగా కుదుటపడుతున్నాయి. యుద్ధం మొదలైన తర్వాత అంటే ఈ నెల 13 నుంచి నగరం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేశంలోని మారుమూల ప్రాంతాలకు పరుగులు తీశారు. ప్రస్తుతం వారంతా తిరిగి తమ తమ గూళ్లకు చేరుకుంటున్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. అయితే ఈ యుద్ధంలో గూడచార్యానికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేయడంతో పాటు ఉరిశిక్షలు కూడా అమలు చేస్తోంది ఇరాన్ ప్రభుత్వం.
ఇరాన్‌లోని అణుశుద్ది ప్లాంట్‌లను ధ్వంసం చేశామని ఇటు అమెరికా, అటు ఇజ్రాయెల్ గొప్పగా చెబుతున్నాయి. అయితే దీనికి వ్యతిరేకంగా ఇరాన్ మాత్రం తమ ప్లాంట్‌లు చెక్కుచెదరలేదని స్పష్టం చేస్తున్నాయి. ఇక అమెరికా మాత్రం తమ వైమానిక దాడుల్లో ఇరాన్ అణుశుద్ది ప్లాంట్‌లను కోలుకోలేనంత ధ్వంసం చేశామని తిరిగి ప్లాంట్‌లను ప్రారంభించాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని చెబుతోంది.
ఇజ్రాయెల్ – ఇరాన్ మద్య తాత్కాలిక కాల్పుల ఒప్పందం కొనసాగుతోంది. అమెరికా జోక్యంతో ప్రస్తుతానికి ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 13న యుద్ధం ప్రారంభమైన వెంటనే టెహరాన్ నుంచి ప్రజలు భయంతో దేశంలోని మారుమూల ప్రాంతాలకు తరలిపోయారు. వారంతా తిరిగి తమతమ ఇళ్లకు చేరుకుంటున్నారు. సుమారు రెండు వారాల పాటు చుట్టాల ఇళ్లలో లేదా స్నేహితుల ఇళ్లలో తలదాచుకున్నవారు తిరిగి తమ తమ ఇళ్లకు చేరుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇరాన్ సుప్రీంలీడర్ ఎట్టకేలకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలిసి తమను ఏమీ చేయలేకపోయాయని… యుద్ధంలో తమదే గెలుపు అని ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఇక ఖమేనిని తాము చంపాలనుకున్నామని ఇజ్రాయెలీ డిఫెన్స్ మినిస్టర్ కాట్జ్ గురువారం నాడు ఒక ఇంటర్వ్యూలో అన్నారు.