Published On:

PJR flyover: రేపటి నుంచి అందుబాటులోకి PJR ఫ్లైఓవర్

PJR flyover: రేపటి నుంచి అందుబాటులోకి PJR ఫ్లైఓవర్

PJR flyover :హైదరాబాద్ నగర వాసులకు రేపటి నుంచి PJR ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. శేర్లింగంపల్లి జోన్‌లో 182 కోట్ల రూపాయలతో ORR నుంచి కొండాపూర్ వరకు 1 పాయింట్ 20 కిలో మీటర్లతో శిల్పా లే ఔట్ ఫ్లై ఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం 4 గంటలకి ప్రారంభిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జోనల్, ప్రాజెక్ట్ ఇంజనీర్లతో కలిసి కమిషనర్ ఆర్‌వి కర్ణన్ PJR ఫ్లైఓవర్‌ను పరిశీలించారు. ఈ ఫ్లై ఓవర్ వల్ల ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, శంషాబాద్ వెళ్ళేందుకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని కమిషనర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు.

 

ఫ్లైఓవర్ వలన ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్, మాదాపూర్, శంషాబాద్ వెళ్లే వాహనదారులకు ఇక్కట్లు తప్పనున్నాయి. కొండాపూర్ వెళ్లే వారికి గచ్చిబౌలి క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ అంతరాయం ఉండదు. ఈ ఫ్లైఓవర్ కిండ శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ దాకింద గచ్చబౌలి జంక్షన్ ఉంటుంది.

 

 

ఇవి కూడా చదవండి: