Last Updated:

Singer Kalpana: కోలుకున్న సింగర్‌ కల్పన – అసలేం జరిగిందో చెబుతూ వీడియో రిలీజ్‌!

Singer Kalpana: కోలుకున్న సింగర్‌ కల్పన – అసలేం జరిగిందో చెబుతూ వీడియో రిలీజ్‌!

Singer Kalpana Shared Video After Recovery: సింగర్‌ కల్పన ప్రస్తుతం కోలుకున్నారు. గత మంగళవారం ఆమె అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఒత్తిడి కారణంగా టాబ్లెట్స్‌ వేసుకున్న ఆమె ఓవర్‌ డోస్‌ కావడంతో అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు ఆమె ఇంటికి వచ్చి, అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజుల చికిత్స అనంతరం కోలుకున్న కల్పన ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో మీడియా, అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని ఆమె స్పష్టం చేశారు.

ఆయన వల్లే నేను బతికాను..

అలాగే ఈ సమయంలో తన కుటుంబం గురించి మీడియాల్లో ఏవేవో వార్తలు వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందులో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. “మీడియాలో మా కుటుంబంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. దానిపై మీ అందరికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. మీ ముందుకు మళ్లీ నేను ఇలా వచ్చి మాట్లాడుతున్నానంటే నా భర్త పడే కష్టం. నన్ను కాపాడాటానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. సరైన టైంలో స్పందించి చూట్టు ఉన్నవారికి, పోలీసులకుస సమాచారం ఇచ్చారు.

వృత్తిపరమైన ఒత్తిడి వల్లే

కాబట్టి మా కుటుంబం గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు. నా భర్తతో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. ఆయన నేను, నా కూతురు చాలా సంతోషంగా జీవిస్తున్నాం. నాకిప్పుడు 45 ఏళ్లు. ఈ వయసులో కూడా నేను పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ చేస్తున్నానంటే నా భర్త సహకారం వల్లే. ఆయనతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. మేమిద్దరం చాలా ఆన్యోన్యంగా జీవిస్తున్నాం. నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన బెస్ట్‌ గిఫ్ట్‌ నా భర్త ప్రసాద్‌ ప్రభాకర్‌. మాకు ఎలాంటి పర్సనల్‌ ఇష్యూస్‌ లేవు. నా ఆరోగ్యం కూడా చాలా బాగుంది.. వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా తరచూ నిద్రలేమితో బాధపడుతున్నాను. దానికి కోసం చికిత్స తీసుకుంటున్నా.

డాక్టర్స్‌ నాకు ఇన్సోమియా ఉందని చెప్పి మెడిసిన్‌ వాడుతున్నా. ఆ రోజు అందులో డోస్‌ ఎక్కువ కావడంతో అపస్మారక స్థితికి వెళ్లాను. అంతే తప్పా మా కుటుంబ సభ్యులతో నాకు ఎలాంటి గొడవలు లేవు. మా కుటుంబం చాలా ఆనందంగా జీవిస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం అనారోగ్య సమస్యల వల్ల ఈ ఇబ్బంది అయ్యింది, మళ్లీ పాడటానికి, మీమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి త్వరలోనే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీరంతా వేచి ఉండండి. ఇక నా ఆరోగ్యం గురించి వాకబు చేసిన ప్రతి ఒక్కరి క్రతజ్ఞతలు. ముఖ్యంగా టైంకి స్పందించిన తనని ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.