Published On:

Actor Rajiv Kanakala and Anchor Suma: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజీవ్ కనకాల, సుమ

Actor Rajiv Kanakala and Anchor Suma: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజీవ్ కనకాల, సుమ

Actor Rajiv Kanakala and Anchor Suma Visit Tirumala: తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని టాలీవుడ్ యాక్టర్ రాజీవ్ కనకాల దర్శించుకున్నారు. ఆయనతో పాటు సతీమణి యాంకర్ సుమ కూడా ఉన్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ మేరకు వారికి అధికారులు స్వాగతం పలికారు. కాగా, ఆలయంలో రాజీవ్ కనకాల, సుమ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.

 

అలాగే లోక్ సభ సభ్యుడు, ఎంపీ బీకే పార్థసారథి ఇవాళ తిరుమలను దర్శించుకున్నారు. ఇక, వేసవి సెలవులు మరో 5 రోజుల్లో ముగియనున్నాయి. ఈ క్రమంలో తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతోంది. తిరుమలలోని వైకుంఠ కాంప్లెక్స్‌లోని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండి పోయాయి. శ్రీవారి సర్వదర్శనం కోసం 20 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ బుకింగ్ చేసుకున్న భక్తులకు దర్శనం 5 గంటలు పడుతుందన్నారు.