Last Updated:

Kissik Song Making Video: ‘పుష్ప 2’ కిస్సిక్‌ సాంగ్‌ మేకింగ్‌ వీడియో చూశారా?

Kissik Song Making Video: ‘పుష్ప 2’ కిస్సిక్‌ సాంగ్‌ మేకింగ్‌ వీడియో చూశారా?

Pushpa 2 Kissik Song Making Video Out: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్టర్ సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప 1, పుష్ప 2 చిత్రాలు ఎంతటి విజయం సాధించాయో తెలిసిందే. గతేడాది విడుదలైన ‘పుష్ప 2’ భారీ కలెక్షన్స్‌ రాబట్టి బాక్సాఫీసును షేక్‌ చేసింది. పైనల్‌గా ఇండస్ట్రీ హిట్‌ కొట్టింది. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ ఇంటెన్స్‌ యాక్షన్‌కి థియేటర్లు దద్దరిల్లాయి. పుష్ప చిత్రాల పాటలు కూడా ఇంటర్నేషనల్‌ స్థాయిలో మారుమోగాయి.

పుష్ప 1లోని ఊ అంటావా మావా ఊఊ అంటావా పాటకు గ్లోబల్‌ వైడ్‌గా ట్రెండ్‌ అయ్యింది. ఇక పుష్ప 2లోని కిస్సిక్‌ సాంగ్‌కి బాగా వైరల్‌ అయ్యింది. ఇందులో యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల తనదైన డ్యాన్స్‌తో అదరగొట్టింది. ముఖ్యంగా ఈ పాటలో ఆమె గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. కిస్‌ కిస్‌ కిస్సిక్‌ అంటూ ఆమె వేసిన సిగ్నేచర్‌ స్టేప్స్‌ ఉర్రూతలూగించాయి. అయితే ఇప్పుడు ఈ సాంగ్‌ మేకింగ్‌ వీడియో రిలీజ్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేసింది మూవీ టీం. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.

ఈ పాటను తెరకెక్కించేందుకు తెర వెనక జరిగిన ఆసక్తికర సన్నివేశాలను ఇందులో చూపించారు. సుకుమార్‌ డైరెక్షన్‌ నుంచి కొరియోగ్రఫీ వరకు కిస్సిక్‌ సాంగ్‌ ఎలా తెరకెక్కిందనేది చూపించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించగా.. చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. సింగర్‌ సుభాషిని ఆలపించింది. బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ గణేష్‌ ఆచార్య ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు.