Published On:

Kannappa Trailer: ‘కన్నప్ప’ ట్రైలర్‌ అప్‌డేట్‌ – రిలీజ్‌ ఎప్పుడంటే..

Kannappa Trailer: ‘కన్నప్ప’ ట్రైలర్‌ అప్‌డేట్‌ – రిలీజ్‌ ఎప్పుడంటే..

Kannappa Trailer Release Update: పాన్‌ ఇండియా మూవీ ‘కన్నప్ప’ రిలీజ్‌కు ఇంకా కొన్ని రోజులే ఉంది. జూన్‌ 27న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా విడుదల కాబోతోంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్‌తో ఫుల్‌ బిజీగా ఉంది. మొదటి నుంచి కన్నప్ప ప్రమోషన్స్‌ వినూత్నంగా చేస్తూ వస్తున్నాడు విష్ణు. ఇక రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌ జోరు పెంచాడు. వరుస ఇంటర్య్వూలు ఇస్తూ మూవీకి విశేషాలను షేర్‌ చేస్తున్నాడు. ఇక కన్నప్ప సూపర్‌ హిట్‌ అనే ధీమా కూడా వ్యక్తం చేస్తున్నాడు.

 

మొదటి టీజర్‌తో ట్రోల్స్‌ రాగా.. శిశయ్య పాటతో అది మొత్తం పోయింది. ఈ పాట యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. దీంతో కన్నప్ప మూవీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇంటర్య్వూలోనూ పలు ఆసక్తిక విషయాలు బయటపెడుతూ మూవీపై హైప్‌ పెంచుతున్నాడు విష్ణు. ఇక సినిమా రిలీజ్‌ దగ్గర పడుతుండటంతో ట్రైలర్‌ రిలీజ్‌కి ముహుర్తం ఫిక్స్‌ చేశారు. ఈ మేరకు మూవీ టీం ప్రకటన కూడా ఇచ్చింది. జూన్‌ 13 అంటే మరో రెండు రోజుల్లో ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తున్నట్టు ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు.

 

మూవీ విడుదలకు రెండు వారాల ముందే ట్రైలర్‌ విడుదల అవుతుండటం విశేషం. ఇప్పటికే ట్రోల్స్, ప్రశంసలతో మంచి బజ్‌ తెచ్చుకున్న కన్నప్పకు ట్రైలర్‌ ఎలాంటి టాక్‌ ఇస్తుందనేది ఆసక్తి నెలకొంది. ఇక ఈ ట్రైలర్‌ రిలీజ్‌ అయితే తమకు మంచి స్టఫ్‌ దొరికనట్టే అనుకుంటున్నారు మీమర్స్‌. మరి విష్ణు ట్రోలర్స్‌ని డిసప్పాయింట్‌ చేస్తాడా? స్టఫ్‌ ఇస్తాడా? చూడాలి. మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్ ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

 

ప్రభాస్‌, మోహన్‌ లాల్, అక్షయ్‌ కుమార్‌, కాజల్‌ వంటి అగ్రతారలు ఈ సినిమా ప్రత్యేక పాత్రలు పోషిస్తుండటంతో మూవీపై బజ్‌ పెరిగింది. ముఖ్యంగా ప్రభాస్‌ ఈ సినిమాలో భాగమవ్వడం కన్నప్పకు మరింత ప్లస్‌ అనే చెప్పాలి. గతేడాది డిసెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం తరచూ వాయిదా పడుతూ వస్తోంది. మే 30 నుంచి జూన్‌ 27న రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసింది. ఈ చిత్రం కోసం ప్రముఖ టెక్నిషియన్స్‌, ఎనిమిది వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు పని చేస్తున్నట్టు విష్ణు ఇంటర్య్వూలో వెల్లడించాడు.