Last Updated:

Thandel collection: అదరగొట్టిన ‘తండేల్‌’ – నాగ చైతన్య కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Thandel collection: అదరగొట్టిన ‘తండేల్‌’ – నాగ చైతన్య కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Thandel Movie Day 1 Collections: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్‌ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన వస్తోంది. పాటలు, మ్యూజిక్‌తో తండేల్‌పై మంచి బజ్‌ నెలకొంది. అంచనాల మధ్య ఫిబ్రవరి 7న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్ తెచ్చుకుని హిట్‌ ట్రాక్‌లో పడింది.

అప్పుడే మూవీ టీం కూడా సబ్బరాలు మొదలు పెట్టింది. రిలీజైన ఫస్ట్‌ షో నుంచి ఈ సినిమా ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన అందుకుంది. ఫస్ట్‌డే ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టి సర్‌ప్రైజ్‌ చేసింది. నాగ చైతన్య కెరీర్‌లోనే హయ్యొస్ట్‌ గ్రాస్‌గా తండేల్‌ మూవీ నిలిచింది. ఫస్ట్‌డే ఈ మూవీ వరల్డ్‌ వైడ్‌గా రూ. 21.27 కోట్లు గ్రాస్‌ వసూళ్లు చేసింది. ఈ మేరకు మూవీ టీం పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. నాగ చైతన్య కెరీర్‌ హయ్యేస్ట్‌ గ్రాస్‌ చేసిన తొలి చిత్రం తండేల్‌ రికార్డు సృష్టించింది. పాజిటివ్‌ టాక్‌ రావడంతో థియేటర్లకు ఆడియన్స్‌ క్యూ కడుతున్నారు.

ఇక నెక్ట్స్‌ వీకెండ్‌ కావడంతో మూవీ వసూళ్లు మరింత పెరిగే అవశాకం ఉందంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. మరోవైపు విదేశాల్లో తండేల్‌ యమ జోరు చూపిస్తోంది. ఓవర్సిస్‌లోనూ మూవీ భారీ ఒపెనింగ్స్‌ ఇచ్చింది. తొలి రోజు ఈ సినిమా 400k డాలర్లు వసూళ్లు చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ అక్కడి నిర్మాణ సంస్థ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. దీనికి ‘అలలు మరింత బలపడుతున్నాయి’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. బుక్‌ మై షోలోనూ తండేల్‌ మూవీకి మంచి క్రేజ్‌ వస్తోంది. 24 గంటల్లో 2 లక్షల టికెట్స్‌ అమ్ముడుపోయినట్టు సమాచారం. దీంతో బుక్‌ మై షోలో ప్రస్తుతం ‘తండేల్‌’ మూవీ ట్రెండింగ్‌లో నిలిచింది.

‘తండేల్’ కథ విషయానికి వస్తే..

తండేల్‌ను యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారుల జీవితాల్లో వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. సముద్రంలో వేటకు వెళ్లిన 22 మంది మత్స్యకారులు పాక్ జలాల్లోకి ప్రవేశిస్తారు. దీంతో అక్కడి నేవీ అధికారులు వారిని అరెస్ట్‌ చేస్తారు. వారిని అక్కడి జైల్లో పెట్టి చిత్రహింసలకు గురిస్తారు. ఇక వీరు విడుదల అవుతున్న క్రమంలో మోదీ ప్రభుత్వం కశ్మీర్‌ ప్రతిపత్తిగా ఉన్న 370 ఆర్టికల్‌ని రద్దు చేస్తారు. దీంతో ఆవేశంతో రగిలిపోయిన పాక్‌ ప్రభుత్వం వీరి విడుదలను నిలిపివేస్తుంది. అప్పుడు రాజు ప్రియురాలు సత్య ఏం చేసింది? పాకిస్తాన్‌ జైల్లో వీరికి ఎదరైన అనుభవాల తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. హృద్యమైన ప్రేమ కథకు భావోద్వేగాలు, దేశభక్తిని జతచేసిన దర్శకుడు తెరకెక్కించి విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుటుంది. దీంతో ఈ ప్రేమకథ ఆడియన్స్‌ బ్రహ్మరథం పడుతున్నారు.