Manchu Manoj: పోలీసులతో వాగ్వాదం – వీడియో రిలీజ్ చేసిన మంచు మనోజ్!

Manchu Manoj Clarifies on Argue With Police: సినీ హీరో మంచు మనోజ్‌కు, పోలీసులకు గత రాత్రి వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల తిరుపతి వెళ్లిన మనోజ్ భాకరపేట సమీపంలోని ఓ ప్రైవేటు గెస్ట్ హౌజ్‌లో బస చేశాడు. పెట్రోలింగ్‌లో భాగంగా అటూ వెళ్లిన పోలీసులు, మనోజ్‌ను ప్రశ్నించారు. ఆయన ఉంటున్న గెస్ట్ హౌజ్‌ని తనిఖీ చేశారు. ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అంటూ ప్రశ్నిస్తూ మనోజ్‌తో అనుమానస్పదంగా వ్యవహరించారు.
దీంతో మనోజ్ ఈ టైంలో తనని ఎందుకు ప్రశ్నిస్తున్నారని, తానేమైన దొంగ, టెర్రరిస్టా.. ఈ టైంలో పోలీసులు తనని డిస్ట్రబ్ చేయడమేంటని తిరిగి ప్రశ్నించారు. తన ప్రశ్నలకు సమాధానం కావాలంటూ పోలీసు స్టేషన్‌లో ఆందోళన చేపట్టాడు. నిన్న రాత్రి జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిపై తాజాగా మనోజ్ వీడియో రిలీజ్ చేశాడు. ఈ మేరకు మనోజ్ మాట్లాడుతూ… “గత కొన్ని నెలలుగా ఏం జరుగుతుందో మీరంతా చూస్తున్నారు. ఇదంతా నేను మా స్టూడెంట్స్ కోసం, యూనివర్సిటీ పని చేస్తున్న వారి కోసం, దాని ముందు పని చేసుకుంటున్న ప్రజల కోసం పోరాటం చేస్తున్నాను. ఫస్ట్ నుంచి నేను దాని గురించి మాట్లాడుతుంటే దాని గురించి తప్ప మిగత విషయాలకు డైవర్ట్ చేస్తున్నారు. నన్ను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు.
#ManchuManoj 😳 pic.twitter.com/nJLlnFgNqN
— Filmyscoops (@Filmyscoopss) February 18, 2025
నాతో పాటు నా భార్యపై కూడా ముప్పైకి పైగా బోగస్ కేసులు పెడుతున్నారని మనోజ్ ఆరోపించారు. అయితే ఇవన్నింటికి నేను భయపడతాను అనుకుంటున్నారేమో.. ఈ జన్మకు అది జరగని పని. వీళ్లు బౌన్సర్ చేసుకుని మా వాళ్లను కొడుతున్నారు. స్టూడెంట్స్‌ని, ఊరు వాళ్లందరిని కొడుతున్నారని చెప్తూనే ఉన్నాను. వీటిని ఎన్ని కంప్లయిట్స్ ఇస్తున్నా తీసుకోవడం లేదు. ఎఫ్‌ఐఆర్‌లో ఇది బాగా లేదు, అది బాగా లేదు మంచి రాసుకుని రండి! అంటున్నారు. యూనివర్సిటీ ముందు ఉన్న నా వాళ్ల కోసం నేను పోరాటం చేస్తున్నాను. విద్యార్థులకు న్యాయం చేయమని పోరాటం చేస్తున్నాను. నా వాళ్లపైన దాడులు చేసి విధ్వంసం సృష్టిస్తుంటే పోలీసులు ఏమి చేయట్లేదు. నాపై కావాలని లేనిపోనీవి కల్పించి నన్ను భయపెట్టాలని చూస్తున్నారు” అని అన్నారు.