Director Shankar: కాపీరైట్ కేసు – డైరెక్టర్ శంకర్‌కి హైకోర్టులో ఊరట, ఈడీ చర్యపై సీరియస్

Director Shankar Gets Relief in Court: స్టార్ డైరెక్టర్ శంకర్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. కాపీ రైట్ కేసులో ఆయన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. రోబో మూవీ కథ విషయంలో ఆయన కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. కాపీ రైట్‌కి పాల్పడ్డారా? లేదా? అనే దానిపై నివేదిక ఇవ్వాలని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)ని ఆదేశిచింది. అయితే ఎఫ్‌టీఐఐ తన నివేదికలో డైరెక్టర్ శంకర్ కాపీరైట్‌కి పాల్పడినట్టు తెలిచ్చింది.
ఈ నివేదిక ఆధారంగా ఈడీ చర్యలు తీసుకుంది. సుమారు రూ. 10 కోట్లు స్థిర ఆస్తులను అటాచ్ చేసింది. దీంతో ఈడీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన మరోసారి హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో తనకు అనుకూలంగా ఇచ్చిన కోర్టు తీర్పును కూడా లెక్కచేయకుండా ఈడీ చర్యలు తీసుకుందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇవాళ (మార్చి 11) శంకర్ పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలపై స్టే విధించింది.
న్యాయమూర్తులు ఎంఎస్ రమేష్,ఎన్ సెంథిల్ కుమార్‌ల సెషన్‌లో శంకర్ కేసు విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన తరపున సీనియర్ న్యాయవాది పీఎస్ రామన్.. రోబో సినిమా కథ విషయంలో శంకర్ కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించలేదని మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జీ వారు గతంలోనే తీర్పు ఇచ్చినట్టు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయినప్పటికీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం వారు శంకర్ ఆస్తులను జప్తు చేశారని కోర్టుకు తెలిపారు. సినిమాకు సంబంధంలేని ఆస్తులను కూడా ఈడీ ఎలా అటాచ్ చేస్తుందని ప్రశ్నించారు.
ఆయన వాదనలు విన్న న్యాయమూర్తులు.. ఈడీ చర్యలను తప్పుబట్టింది. ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం సాధ్యమేనా? అని ఈడీని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో స్టే విధించినప్పుడు తుది తీర్పు రాకుండానే చర్యలు తీసుకోవడం వెనక మీ ఉద్దేశం ఏంటని ఈడీని ప్రశ్నించింది. దీనికి ఈడీ తరపు న్యాయవాది స్పందిస్తూ.. నేరం రుజువైతే ఒక వ్యక్తి ఇచ్చని ఫిర్యాదు ఆధారంగా ఈడీ విభాగం కేసు నమోదు చేయొచ్చని తెలిపారు. అయినప్పటి ఈడీ చర్యలపై న్యాయమూర్తులు మండిపడ్డారు. శంకర్ కేసులో పూర్తి స్థాయిలో తమకు వివరణ ఇవ్వాలని ఈడీ వారుఆదేశిస్తూ ఈ కేసు విచారణ ఏప్రిల్ 21కి వాయిదా వేశారు.