Payal Rajput: నటుడితో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ పెళ్లి? – వరుడు ఎవరంటే..

Payal Rajput Wedding News: పాయల్ రాజ్‌పుత్.. ప్రత్యేకమైన పరిచయం అవసరం లేని పేరు. ఆర్‌ఎక్స్100 మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో హాట్‌హాట్‌గా అందాలు ఆరబోసి కనిపించి యూత్‌ని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలోని అందం, అభినయంతో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఆర్‌ఎక్స్100తో ఓవర్ నైట్ స్టార్‌డమ్ అందుకున్న పాయల్ అదే క్రేజ్‌ను కొనసాగించలేకపోయింది. ఆ తర్వాత ఆమె నటించి చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయాయి.
ఇటీవల ఆమె మంగళవారం చిత్రంలో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో బోల్డ్ రోల్ పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమె మరేమూవీని ప్రకటించలేదు. మంగళవారం విడుదలై రెండేళ్లు అవుతుంది. అయితే ఈ సినిమా సీక్వెల్ ఉందని మూవీ టీం పేర్కొంది. కానీ ఇది ఎప్పుడు వస్తుందనేది క్లారిటీ లేదు. వెండితెరపై పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం సందడి కనిపిస్తూనే ఉంది. తన హాట్‌హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌ని అలరిస్తోంది.
ఇదిలా ఉంటే పాయల్ రాజ్‌పుత్ గురించి ఓ ఆసక్తిర విషయం బయటకు వచ్చింది. త్వరలోనే ఈ భామ పెళ్లి పీటలు ఎక్కబోతుందట. ఈమధ్య పాయల్ ఓ వ్యక్తితో చాలా క్లోజ్ ఉంటున్న సంగతి తెలిసిందే. తరచూ అతడితో కలిసి దిగుతున్న ఫోటోలు షేర్ చేస్తోంది. దీంతో అతనెవరా? అనేది అంత ఆరా తీస్తున్నారు.ఈ క్రమంలో పాయల్ అతడినే పెళ్లి చేసుకోబోతోందని తెలిసింది. అతడి పేరు సౌరబ్. పంజాబ్‌కి చెందిన యాక్టర్, మోడల్, ప్రోడ్యూసర్ అని తెలుస్తోంది. అతడు మరెవరో కాదు పాయల్ చిరకాల మిత్రుడు అని సమాచారం. అతడితోనే ఈ భామ ఏడడుగులు వేయబోతోందట.
వీరి పెళ్లికి రెండు కుటుంబాలు కూడా ఒకే చెప్పాయట. దీంతో ఈ పాయల్, సౌరబ్‌లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరగుతున్నాయని సమాచారం. త్వరలోనే ఈ పాయల్ తన పెళ్లి కబురును ఆఫీషియల్ అనౌన్స్ చేయాలను చూస్తున్నట్టు సినీ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే పాయల్ స్వయంగా ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే. తెలుగులో ఆర్‌ఎక్స్ 100, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, జిన్నా వంటి చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం కిరాతక, గొల్‌మాల్ అనే మూవీ చేస్తోంది. అలాగే తమిళంలో ఓ సినిమా చేస్తున్నట్టు సమాచారం.
View this post on Instagram