Kanguva: సూర్య కొత్త మూవీ కంగువా ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
‘Kanguva’ OTT release date: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కంగువా’. ఈ మూవీకి శివ దర్శకత్వం వహించాడు. ఫాంటసీ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొత్తం 10 భాషల్లో విడుదలైన ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఇందులో జగపతిబాబు, యోగిబాబు, సుబ్రమణ్యం రవికుమార్ కీలక పాత్రలో నటించగా.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
తాజాగా, ఈ సినిమా మేకర్స్ అప్డేట్ ప్రకటించారు. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 8న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని ప్రైమ్స్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. తెలుగుతో పాటు మలయాళ, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో సూర్య విభిన్న పాత్రల్లో నటించారు.