Published On:

Dhurandhar Teaser Out: ధురంధర్‌ టీజర్‌ రిలీజ్.. ప్రభాస్‌కు పోటీగా రణ్‌వీర్ సింగ్!

Dhurandhar Teaser Out: ధురంధర్‌ టీజర్‌ రిలీజ్.. ప్రభాస్‌కు పోటీగా రణ్‌వీర్ సింగ్!

Ranveer Singh’s Dhurandhar Teaser Out Now: రణ్‌వీర్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు శుభవార్త.. హీరోగా రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న ధురంధర్‌ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం ‘ఫస్ట్‌ లుక్‌’ పేరుతో టీజర్‌ని రిలీజ్ చేశారు. కానీ ఏ మాటకు ఆ మాట ఈ టీజర్‌‌లో మాత్రం రణ్‌వీర్ సింగ్ లూక్ అదిరిపోయింది. మోస్ట్ వైలెన్స్ అవతారంలో హీరో రణ్‌వీర్ సింగ్ అందరిని కట్టిపడేశారు. ముఖంపై రక్తంతో సిగరెట్ వెలిగించుకుంటూ ఓ లుక్ ఇచ్చారు. మసక వెలుతురులో రణ్‌వీర్ సింగ్ నడుచుకుంటూ వెళ్లడంతో టీజర్‌ మొదలవుతుంది.

 

ఈ టీజర్‌‌లో యాక్షన్ మోడ్‌లో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్‌లు కూడా ఉన్నారు. మరోవైపు హెవీ యాక్షన్‌తో రణ్‌వీర్ సింగ్ కనిపించడంతో అభిమానులు సినిమా టోన్‌పై ఉత్సాహం చూపుతున్నారు. అయితే గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపొందుతున్న ధురంధర్‌ టీజర్‌‌‌తో పాటు రిలీజ్ డేట్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూవీకి రచన, దర్శకత్వం ఆదిత్య ధార్ జ్యోతి దేశ్ పాండే, లోకేష్ ధార్ వహించారు. అయితే ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 

మరోవైపు ధురంధర్ సినిమా రిలీజ్ అయ్యే రోజే ప్రభాస్ మూవీ రాజాసాబ్ సినిమా కూడా రిలీజ్ కానుంది. అంటే ఆ ఒక్క రోజే రెండు సినిమాలు థియేటర్లలో పోటీ పడనున్నాయి. ప్రస్తుతం ధురంధర్‌ సినిమా టీజర్‌ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక మన హీరో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్‌ మూవీ అయితే భారీ అంచనాలతో రిలీజ్‌కు రెడీ అవుతుంది. మారుతీ డైరెక్షన్‌లో ఈ మూవీ రొమాంటిక్, హారర్, కామెడీగా తెరకెక్కనుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని రాజాసాబ్‌ మూవీ కోసం ఎదురుచుస్తున్నారు. ఇక ధురంధర్ సినిమా రిలీజ్ అయితే చూడాలి.. ఎంత వసూళ్లు చేస్తుందో.. ప్రభాస్ మూవీని ఢీకొట్టి తట్టుకుంటుదో..!

 

 

ఇవి కూడా చదవండి: