NTR: యాక్టర్ అవుతా బావ అంటే.. నా సపోర్ట్ నీకు ఉండదు పోయి చావు అన్నా

NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తమ్ముడు నార్నే నితిన్ మ్యాడ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాకు కంటిన్యూగా మ్యాడ్ స్క్వేర్ తో ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరో ఇద్దరు హీరోలుగా నటించారు. నిర్మాత చినబాబు కూతురు హారిక నిర్మాతగా మారి నిర్మించిన ఈ సినిమా సక్సెస్ మీట్ ను మేకర్స్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు.
మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ” చాలాకాలం అయ్యింది మీతో మాట్లాడి.. ఇది వంశీ వలనే జరిగింది. నవ్వించడం ఒక వరం. అలా ఎంతోమంది బాధల్లో, కష్టాల్లో ఉన్నవారిని నవ్వించాడు కళ్యాణ్ శంకర్. ఒక సినిమా హిట్ అయ్యాక దానికి సీక్వెల్ తీసి హిట్ కొట్టడం చాలా కష్టం.. కళ్యాణ్ శంకర్ సాధించాడు.
సినిమాలో ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారు. తండ్రి పాత్రలో చేసిన మురళీధర్ గౌడ్ అద్భుతంగా నటించారు. సినిమాలో ముగ్గురు హీరోలు ఉన్నా సినిమా ఇంత హిట్ అయ్యింది అంటే దానికి కారణం లడ్డూ విష్ణు. అతని ఇనోసెన్స్ వలనే అంత కామెడీ పండింది. ఇక సంగీత్ శోభన్ గురించి చెప్పాలంటే.. వాళ్ల నాన్న శోభన్ నాకు పెద్ద పరిచయం లేదు. ఒక్కసారి కలిశాను. చాలా మంచి వ్య్కయి. ఎంతో హంబుల్ గా కనిపించారు. సంగీత్ కు తన తండ్రి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు DD అని అరిచినవారే రేపు సంగీత్ సంగీత్ అని అరుస్తారు. ఆల్ ది బెస్ట్.
రామ్ నితిన్ ను చూసినప్పుడు నన్ను నేను చూసుకున్నట్లు ఉండేది. ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో రామ్ ఇప్పుడు అలా ఉన్నాడు. అతను ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నాను. నాకు 2011లో పెళ్లి అయ్యింది. అప్పటికీ నితిన్ చాలా చిన్న పిల్లాడు, నాతో అస్సలు మాట్లాడేవాడు కాదు. నేను వచ్చినా కూడా లోపలి వెళ్లిపోయేవాడు.
అంత సైలెంట్ గా ఉండే నితిన్.. ఎంతో ధైర్యంగా నా ముందుకు వచ్చి నాతో చెప్పిన మాట.. బావ నేను యాక్టర్ ను అవుతాను అని. అప్పుడు నేను కూడా చెప్పాను.. నా సపోర్ట్ నీకు ఉండదు పోయి చావు అన్నాను. నలుగురు మధ్యలో మాట్లాడలేడు. ఇండస్ట్రీలో ఇంతమంది ముందు ఎలా ఉంటాడు అనే భయం వేసింది. నాకు ఏం చెప్పకు నితిన్.. నీకు నచ్చింది నువ్వు చెయ్ అని చెప్పాను. ఇప్పటివరకు నాకు ఈ సినిమా చేస్తున్నాను.. ఈ కథ విన్నాను.. ఒక్క సీన్ కూడా చెప్పింది లేదు.
మంచి మంచి డైరెక్టర్స్ ను, నిర్మాతలను ఎంచుకొని హిట్ కొట్టాడు. నితిన్ ను చూసి నేను గర్వపడుతున్నాను. ఇక నాకు బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తరువాత అంత ఎక్కువగా ఇష్టపడే కమెడియన్ సునీల్. ఆయనలోని వింటేజ్ కామెడీ కనిపించింది. అసలు సునీల్ లేకపోతే మ్యార్ 2 లేదు. కార్తికేయ, సత్యం రాజేష్ వీరందరూ చాలా బాగా నవ్వించారు.
ఇక వీరందరినీ ముందు ననుంచోపెట్టి వెనుక నుంచి నడిపింది చింటూ వంశీ. ఆయన నిర్మాతగా నేను ఒక సినిమా చేయబోతున్నాను. మిగతా విషయాలు త్వరలోనే వంశీ చెప్తాడు. నన్ను వదిలేయండి.. ఏది ఉన్నా వంశీతో మాట్లాడండి. మాట కటువుగా ఉన్నా.. వంశీ మనసు చాలా మంచిది. ఇలాంటి వ్యక్తిని నేను లైఫ్ లో కలవలేదు.
దేవర సినిమాను ఇంత మంచి సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్తున్నాను. దేవర 2 ఉండదు. రాదు అన్న వార్తలు అబద్దం. కచ్చితంగా దేవర 2 ఉంటుంది. కొద్దిగా సమయం పడుతుంది. మధ్యలో ప్రశాంత్ నీల్ వచ్చాడు. అది ఫినిష్ చేశాక మొదలుపెడతాం. మా నాన్న నాకు ఈ జన్మ ఇచ్చాడు. ఈ జన్మ మాత్రం అభిమానులకే అంకితం. ఎప్పుడు చెప్తూనే వస్తున్నాను. మీ అందరినీ కాలర్ ఎత్తుకొనేలా చేస్తాను అని.. ఒక్కోసారి అది కుదరకపోయినా.. కష్టపడతాను. జీవితం మొత్తం కష్టపడి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. అందరు జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. మీకోసం మీ అమ్మానాన్న ఎదురుచూస్తూ ఉంటారు” అంటూ ఎన్టీఆర్ స్పీచ్ ముగించాడు.