Viva Harsha BMW Car: ఖరీదైన లగ్జరీ కారు కొన్న వైవా హర్ష – దీని ధరేంతో తెలుసా..?

Viva Harsha BUY Brand New BMW Car: వైవా హర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అసవరం లేదు. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించిన అతడు ప్రస్తుతం వెడితెరపై నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. వైవా అనే షార్ట్ ఫిలీంతో బాగా వైరల్ అయ్యాడు. అదే క్రేజ్‌తో సినిమాల్లో కమెడియన్‌గా ఆఫర్స్ అందుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ కమెడియన్‌లో ఒకడిగా రాణిస్తున్నాడు. నటుడిగానే కాదు లీడ్ రోల్లోనూ పలు సినిమాలు చేశాడు. గతేడాది సుందరం మాస్టర్ మూవీలో హీరోగా చేసిన అతడు.. ప్రస్తుతం మోగ్లీ, బకాసుర రెస్టారెంట్ వంటి సినిమాలు చేస్తున్నాడు.
నటుడిగా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న హర్ష తాజాగా ఓ లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. ఇప్పటికే అతడి దగ్గర ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్‌తో కారు కూడా ఉంది. ఇప్పుడు వాటికి తోడు తాజాగా లగ్జీర బీఎండబ్య్లూ కారు కోనుగోలు చేశాడు. కొత్త కారు కొన్న సందర్భంగా తన భార్య, పెట్ డాగ్‌తో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనికి “ఇది మా ట్విన్ టర్బో అని చెప్పడం సురక్షితం. మా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ ఆహ్వానిస్తున్నాం” అంటూ కొత్త కారు కొన్న సందర్భంగా ఆనందం వ్యక్తం చేశాడు. BMW F8M2 కాంపిటీషన్ కారును సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ మార్కెట్‌లో దీని ధర రూ. కోటి మూబ్లై లక్షణ నుంచి రూ. 1.40 కోట్లు ఉంటుందని సమాచారం.
కొత్త కారు కొన్న సందర్భంగా అతడికి ఫ్యాన్స్, ఫ్రెండ్స్‌ని సోషల్ మీడియాలో వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇక హర్ష గ్యారేజ్‌లో విలువైన స్పోర్ట్స్ కార్లు కూడా ఉన్నాయి. అతడి బైక్స్ అంటే పిచ్చి. వాటిపై తరచూ రేసింగ్, లాంగ్ డ్రైవ్స్‌కి వెళుతుంటాడు. ఇప్పటికే హర్ష దగ్గర రూ. 20 లక్షల, రూ. 30 లక్షల విలువ చేసే స్పోర్ట్స్ బైక్స్ కలెక్షన్స్ ఉన్నాయి. కాగా 2021లో అక్షర అనే అమ్మాయి పెళ్లి చేసుకున్న హర్ష ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. తరచూ భార్య విదేశాలకు వెకేషన్స్, టూర్స్ వెళుతుంటాడు. అంతేకాదు ఆమెతో కలిసి సందడి చేస్తున్న ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటాడు. ఇటూ ప్రొఫెషనల్, అటూ ప్రర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌లో సక్సెస్ ఫుల్‌గా ముందుకు వెళుతున్నాడు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి:
- Game Changer Editor: ‘గేమ్ ఛేంజర్‌కు పని చేయడం ఓ చేదు అనుభవం.. డైరెక్టర్‌పై ఎడిటల్ సమీర్ విమర్శలు