Published On:

Kuberaa Success Meet: ధనుష్ పాత్ర ఎవరూ చేయలేరు.. చిరంజీవి కాళ్లు మొక్కిన ధనుష్

Kuberaa Success Meet: ధనుష్ పాత్ర ఎవరూ చేయలేరు.. చిరంజీవి కాళ్లు మొక్కిన ధనుష్

Kuberaa Success Meet mega star chiranjeevi and Dhanush: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ‘కుబేర’. ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను భారీ అంచనాలతో శుక్రవారం థియేటర్స్‌లోకి  వచ్చింది. తొలి రోజు మంచి టాక్ సొంతం చేసుకుంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు ధనుష్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంద్భరంగా ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టడంతో హైదరాబాద్‌లో ఆదివారం మేకర్స్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

 

ఇక, ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడారు. ‘కుబేర’ సినిమాలో ధనుష్ చేసిన దేవా క్యారెక్టర్ హృదయానికి హత్తుకుపోయిందని కొనియాడారు. ఈ పాత్రను ధనుష్ తప్పా దేశంలో ఉన్న ఏ స్టార్ హీరో చేయలేడని పేర్కొన్నారు. ఇలాంటి క్యారెక్టర్‌ను కూడా నేను చేయలేనన్నారు. ధనుష్ చాలా నేచురల్‌గా నటించారని చెప్పారు. అందుకే ధనుష్‌కు నేషనల్ అవార్డు కచ్చితంగా రావాలని, లేదంటే ఆ అవార్డులకు అర్థం లేదని వ్యాఖ్యానించారు.

 

అంతకుముందు, ఈవెంట్‌కు చిరంజీవి వస్తున్న సమయంలో లోపలకు వచ్చిన వెంటనే హీరో ధనుష్ షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత చిరంజీవి పాదాలకు నమస్కరించారు. అడిటోరియంలోకి ఎంటరైన తర్వాత ఆయనతో పాటు ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ధనుష్ మాట్లాడారు. సాధారణంగా ఏదైనా రాసేముందు పేపర్ పై ‘ఓం’ ఎలా రాస్తామో అలా చిరంజీవి తమకు ఓం రూపంలో ఈవెంట్ కు వచ్చారని పేర్కొన్నారు. చిన్నతనం నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని, ఇప్పుడు ఆయన ముందే నిల్చొని మాట్లాడడం అద్భుతంగా ఉందన్నారు.

 

ఇక, ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించగా.. జిమ్ సర్బ్, దిలీప్ తాహిల్, షాయాజీ షిండే తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. కార్తీక శ్రీనివాస్ కూర్పు, నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం, సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: