Last Updated:

Cricket Live In INOX: ఇకపై థియేటర్లలో సినిమాలే కాదు క్రికెట్ మ్యాచ్ లైవ్ కూడా..!

క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు క్రికెట్ మ్యాచ్లను మొబైల్ మరియు టీవీ స్క్రీన్లపై మాత్రమే చూసుంటారు కానీ థియేటర్లలోనూ క్రికెట్ చూస్తే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా అయితే ఇది మీకోసమే. ఇకపై భారత జట్టు ఆడే అన్ని గ్రూప్ మ్యాచ్ లను ఐనాక్స్ లో చూడవచ్చు.

Cricket Live In INOX: ఇకపై థియేటర్లలో సినిమాలే కాదు క్రికెట్ మ్యాచ్ లైవ్ కూడా..!

Cricket Live In INOX: క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు క్రికెట్ మ్యాచ్లను మొబైల్ మరియు టీవీ స్క్రీన్లపై మాత్రమే చూసుంటారు కానీ థియేటర్లలోనూ క్రికెట్ చూస్తే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా అయితే ఇది మీకోసమే. ఇకపై భారత జట్టు ఆడే అన్ని గ్రూప్ మ్యాచ్ లను ఐనాక్స్ లో చూడవచ్చు.

భారత జట్టు ఆడబోయే పరిమితమైన క్రికెట్ మ్యాచ్​లను థియోటర్లలో చూసే అవకాశం కల్పించనుంది ఐనాక్స్ సంస్థ. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఐనాక్స్ సంస్థ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. టీమ్ ఇండియా ఆడబోయే అన్ని గ్రూప్ మ్యాచ్‌లను ఇకపై ఐనాక్స్ ప్రదర్శించనుంది. అక్టోబరు 23న పాకిస్తాన్తో భారత్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నుంచే ఐనాక్స్ స్ట్రీమింగ్ ప్రారంభించనుంది. ఈ లైవ్ మ్యాచ్లు దేశంలోని 25 కంటే ఎక్కువ నగరాల్లో ఉన్న ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లలో ప్రసారం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఐనాక్స్కు 165 మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. అవి 705 స్క్రీన్‌లతో 1.57 లక్షల సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇకపోతే ఇటీవల పీవీఆర్ తో కలిసి అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్ను ఏర్పాటు చేసింది ఐనాక్స్.

ఇదీ చదవండి: బీసీసీఐ నుంచి దాదా అవుట్

ఇవి కూడా చదవండి: