Last Updated:

Aghathiyaa: అర్జున్‌, జీవాల అగత్యా నుంచి సెకండ్‌ సింగిల్‌ – ఆకట్టుకున్న నేలమ్మ తల్లి సాంగ్‌

Aghathiyaa: అర్జున్‌, జీవాల అగత్యా నుంచి సెకండ్‌ సింగిల్‌ – ఆకట్టుకున్న నేలమ్మ తల్లి సాంగ్‌

Nelamma Thalli Second Song Release: యాక్షన్ కింగ్‌ అర్జున్‌, నటుడు జీవా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అగత్యా’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రముఖ గీత రచయిత పా. విజయ్‌ కథా, దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరి గణేష్‌ నిర్మిస్తున్నారు. మార్కెల్‌ చిత్రాల తరహాలో ఒక కొత్త ప్రపంచాన్ని అగత్యాతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది మూవీ టీం. ఇందులో కోసం ఈ సినిమా సీజీ వర్క్‌కు పెద్ద పీట వేశారు.

అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతన్న ఈచిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్ష్‌, ఫస్ట్‌ సాంగ్‌ బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రంలోని సెకండ్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. ‘నేలమ్మ తల్లి’ అంటూ సాగే ఈ పాట ఆద్యాంత ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రకృతికి రైతుకు ఉండే కనెక్షన్స్‌ని ఎమోషనల్‌గా చూపించారు. పూర్తి ఎమోషనల్‌ రైడ్‌గా సాగిన ఈ పాట సంగీత ప్రియులను మనుసు హత్తుకుంటోంది. ఈ నేలమ్మ తల్లి సాంగ్‌కు నెటిజన్ల మంచి రెస్పాన్స్‌ వస్తుంది. మార్వెల్‌, అవేంజర్స్‌ తరహా ఈ సినిమా ఉండబోతోందని ఇప్పటికే మూవీ టీం మంచి హైప్‌ క్రియేట్‌ చేసింది. ఆ విధంగా వెర్సెస్‌ డెవిల్స్‌ అనే ఇతివృత్తంతో రూపొందిన చిత్రమిదన్నారు.