Published On:

International Yoga Day 2025: యోగా ఇంటర్నేషనల్ డేకు ఎల్బీ స్టేడియం ముస్తాబు.. ఎప్పుడు చేయాలంటే?

International Yoga Day 2025: యోగా ఇంటర్నేషనల్ డేకు ఎల్బీ స్టేడియం ముస్తాబు.. ఎప్పుడు చేయాలంటే?

International Yoga Day 2025: యోగా.. అందరి జీవితాల్లో ఓ భాగంగా మారింది. దీంతో యోగాతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్లు జిమ్ వద్దకు వెళ్లలేరు. అందుకే వారికి ఈ యోగా మంచి ప్రత్యామ్నాయమని అంటున్నారు. అయితే ఈ యోగా చేసేందుకు పరిమితులు ఉన్నాయి. అతిగా చేస్తే ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

 

యోగాను ఎప్పుడు చేయాలనే విషయాలను నిపుణులు వివరిస్తున్నారు. వ్యాయామం చేసే సమయంలో ముందుగా వార్మప్ చేయాలి. యోగాసనంలో ఇది తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. కానీ కొంతమంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా పట్టించుకోకపోవడంతో యోగా చేయడం కష్టతరమై నెమ్మదిగా ఆసక్తి తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

 

కావున, యోగా చేసేందుకు అరగంట ముందు నుంచే వార్మప్ చేయడం తప్పనిసరి అని సలహాలు ఇస్తున్నారు. దీంతో యోగాసనాలకు శరీరం ప్లెక్సిబుల్ గా తయారయ్యే అవకాశం ఉంటుంది. మెరుగైన ఫలితాల కోసం ఎక్కువసేపు యోగా, శరీరాన్ని ఇబ్బంది పెట్టే ఆసనాలతో మొదటికే మోసం వస్తుందన్నారు.

 

శరీరానికి రెస్పెక్ట్ ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. శరీరాన్ని ఎక్కువసేపు శ్రమపెట్టకూడదని అంటున్నారు. తొలుత 5 నుంచి 10 నిమిషాలు చేయాలి. బీపీ, హార్ట్ సర్జరీ జరిగితే 6 నుంచి 8 నెలలు పూర్తయిన తర్వాత చేయాలని అంటున్నారు. చల్లగా, తేమగా ఉండే ప్రాంతాల్లో యోగా చేస్తే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది.

 

ఇక, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతీ ఏడాది జూన్ 21న నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో 24 గంటల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ మేరకు ఇవాళ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన యోగా కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది.

 

ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శ్రీనివాస వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీనటులు ఖుష్బూ, మీనాక్షి చౌదరి, సాయిధరమ్ తేజ్, తేజా సజ్జా పాల్గొన్నారు. యోగా సర్వయోగి నివారిణి అని, ప్రతి ఒక్కరూ పాటించాలని కిషన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమానికి పట్టణవాసులు పెద్దఎత్తున తరలివచ్చారు.

ఇవి కూడా చదవండి: