Check PF Balance: యూఏఎన్ తెలియకపోయినా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. ఎలా తెలుసా?

Check PF Balance Without UAN: ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరికీ దాదాపు పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. కొన్ని కంపెనీలు పీఎఫ్ తప్పనిసరిగా అమలు చేస్తుండగా.. పలు కంపెనీలు పీఎఫ్ లేకుండానే పనులను కొనసాగిస్తున్నాయి. అయితే పీఎఫ్ అనేది ఉద్యోగుల సంక్షేమానికి వారధిలా ఉంటుంది. ఈ పీఎఫ్‌కు సంబంధించిన అప్డేట్స్ వస్తుంటాయి. కొంతమందికి ఇప్పటికీ వారికి సంబంధించిన పీఎఫ్ గురించి తెలియడం లేదు.
అయితే, మరికొంతమంది ఉద్యోగులు తరచుగా బ్యాలెన్స్ చెక్ చేసుకుంటుంటారు. పీఎఫ్ చెక్ చేసుకునేందుకు యూఏఎన్ ప్రధానమైంది. ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న ప్రతీ ఉద్యోగికీ యూఏఎన్ నంబర్ ఉంటుంది. ఒకవేళ ఈ యూఏఎన్ మరిచిపోయినా లేదా తెలియకపోయినా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు రెండు విధానాలు ఉన్నాయి.
తొలుత ఎస్ఎంఎస్ ద్వారా ఉద్యోగుల పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయం తెలుసుకోవచ్చు. పీఎఫ్ ఉన్న ఉద్యోగులు తమ ఫోన్ నంబర్ నుంచి 7738299899కు మెసేజ్ పంపించి తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇందులో EPFOHO UAN (భాష కోడ్) టైప్ చేసి సెండ్ చేయాలి. ఉదాహరణకు తెలుగు భాషను ఎంచుకుంటే ‘EPFOHO UAN TEL’ అని పంపించాల్సి ఉంటుంది. పంపిన వెంటనే ఫోన్ నంబర్‌కు వచ్చే సూచనలు పాటిస్తే పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఈ అవకాశం యూఏఎన్ నంబర్ యాక్టివ్ గా ఉండే వారికి మాత్రమే వర్తిస్తుంది. దీంతో పాటు యూఏఎన్ నంబర్ బ్యాంకు అకౌంట్‌కు లింక్ చేసి ఉండాలి.
అలాగే, యూఏఎన్ నంబర్ తెలియకపోయినా మిస్డ్ కాల్ ఇచ్చి తెలుసుకోవచ్చు. ఇందులో 9966044425 నంబర్‌కు పీఎఫ్ లింక్ ఉన్న నంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ మెసేజ్ ద్వారా వస్తుంది. ఈ రెండు సేవలు పూర్తిగా ఉచితమే. వీటికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీ నంబర్ రిజిస్టర్ కాకున్న యెడల ఆఫీసుల్లో ఇచ్చే పేస్లిప్స్ లో యూఏఎన్ నంబర్ ఉంటుంది. లేదా అదే ఆఫీసులో హెచ్ఆర్ వాళ్లను సంప్రదించి యూఏఎన్ నంబర్ తెలుసుకొని పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.