Published On:

Ration Cards: రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. నేటితో ముగియనున్న గడువు!

Ration Cards: రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్..  నేటితో ముగియనున్న గడువు!

Ration Cards: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ నేటితో ముగియనుంది. నేటికీ రేషన్ బియ్యం తీసుకొని లబ్ధిదారులు సన్నబియ్యం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యంను జూన్ 30వ తేదీలోగా అందించేందుకు గడువు విధించింది.

 

వర్షాకాలం కావడంతో కొండలు, గిరిజన ప్రాంతాల ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని కేంద్రం రాష్ట్రాలకు రేషన్ పంపిణీకి పలు సూచనలు చేసింది. మొత్తం 3 నెలలు అనగా జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించి ఈనెలలోనే అందించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఇందులో భాగంగానే జూన్ 30తో గడువు ముగియనంది, ఒకవేళ ఇవాళ కాకుంటే మళ్లీ సెప్టెంబర్‌లో రేషన్ ఇచ్చేందుకు వీలు ఉంటుంది.

 

ఇదిలా ఉండగా, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రతీ లబ్ధిదారుడికి నెలకు 6కేజీల చొప్పున 18కేజీలు ఇస్తున్నారు. దేశంలో దొడ్డు బియ్యం ఇస్తే.. రాష్ట్రంలో సన్నబియ్యం అందిస్తున్నారు. మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేస్తుండడంపై రేషన్ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: