Published On:

Budhaditya Yog 2025: బుధాదిత్య యోగ ప్రభావంతో.. ఈ రాశుల వారి కష్టాలు పూర్తిగా తొలగిపోతాయ్

Budhaditya Yog 2025: బుధాదిత్య యోగ ప్రభావంతో.. ఈ రాశుల వారి కష్టాలు పూర్తిగా తొలగిపోతాయ్

Budhaditya Yog 2025: జ్యోతిష్యశాస్త్రంలో.. సూర్యుడు, బుధుడి ప్రభావం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రెండింటి కలయిక బుధాదిత్య యోగాన్ని సృష్టిస్తుంది. ఇది 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. సూర్యుడిని అన్ని గ్రహాలకు రాజు అని పిలుస్తారు. వేద జ్యోతిష్యశాస్త్రంలో.. సూర్యుడిని ఆత్మ, గౌరవం, ప్రతిష్ట, నాయకత్వ సామర్థ్యాన్ని సూచించే గ్రహంగా కూడా పరిగణిస్తారు.

బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్ , వ్యాపారానికి కారకుడని చెబుతారు. బుదుడు, సూర్య గ్రహాల ప్రభావం వల్ల.. ఒక వ్యక్తి కెరీర్‌లో విజయం, వ్యాపారంలో ఆర్థిక లాభం, అలాగే సమాజంలో గౌరవం పొందుతాడు. మరోసారి ఈ రెండు గ్రహాలు కలిసి శక్తివంతమైన రాజయోగాన్ని సృష్టించనున్నాయి. ఇది కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

మే 15, 2025న గ్రహాల రాజయిన సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని తరువాత.. బుధుడు కూడా 23 మే 2025న ఈ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వలన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది 3 రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

వృషభ రాశి: బుధాదిత్య యోగం మీ జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది. ఈ సమయంలో మీ ఇంట్లో సంపద, ఆస్తికి కొరత ఉండదు. ఈ సమయంలో మీ అదృష్టం చాలా వరకు పెరుగుతుంది. కొత్త ప్రణాళికలపై పని చేయడానికి ఇది సరైన సమయం. మీ మార్పులు, ప్రణాళికల నుండి ప్రయోజనం పొందే సమయం ఇది. వ్యాపారంలో చేసే అన్ని ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. మీరు భూమి, ఆస్తి, వాహనాలు , డబ్బు యొక్క ఆనందాన్ని పొందుతారు. వైవాహిక జీవితం మధురానుభూతితో నిండి ఉంటుంది.

సింహ రాశి: ఈ సమయం వ్యాపారం చేసే వారికి ప్రత్యేకమైనది. విద్య లేదా పోటీ పరీక్షలతో సంబంధం ఉన్న వారికి ఈ సమయం ముఖ్యమైనది. మీరు కొత్త ఉద్యోగ ఆఫర్‌ లను కూడా పొందుతారు. మీ కృషికి పూర్తి ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో.. మీరు మీ వ్యాపారంలో కొత్త ప్రాజెక్ట్ లను పొందుతారు. ఒంటరి వ్యక్తుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనివల్ల మీరు కష్టమైన పనుటను కూడా పూర్తి చేస్తారు. ఉన్నతాధికారులు మీ పనులను ప్రశంసిస్తారు.

కుంభ రాశి: బుధ గ్రహం అనుగ్రహంతో మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. కుంభ రాశి వారు ఈ కలయిక వల్ల మనశ్శాంతిని పొందుతారు. మీ ఇంటి నుండి దూరంగా ప్రయాణించాల్సి వస్తుంది. ఇల్లు, కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి కోసం తగినంత అవకాశాలు లభిస్తాయి. కోర్టు కేసుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి: