Published On:

Horoscope for Thursday, May 01, 2025: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయంలో లాభాలే లాభాలు!

Horoscope for Thursday, May 01, 2025: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయంలో లాభాలే లాభాలు!

Horoscope for Thursday, May  1, 2025: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

మేషం: ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు. శ్రమ అధికమయ్యే అవకాశం ఉంది. శత్రువులు తప్పుడు ఆరోపణలు చేస్తారు. మీ తెలివితేటలతో పనులను సజావుగా పూర్తి చేస్తారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు.

వృషభం: ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. లిటిగేషన్ వ్యవహారాలు పరిష్కరించి కొంత ప్రయోజనం పొందగలుగుతారు. అవగాహన లోపంతో బంధువర్గం మిత్రవర్గం నష్టపోయి మిమ్మల్ని కూడా కొంతవరకు నష్టపరుస్తారు.

మిథునం: మీ ఆలోచన శక్తిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. తరచూ నిర్ణయాలను మార్చడం మంచిది కాదు. చిత్తశుద్ధితో చేసే పనులు మంచి ఫలితాలు వస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

 

కర్కాటకం: మనోధైర్యంతో చేసే పనులు మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రారంభించిన పనులను తోటి వారి సహకారంతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.

సింహం: మీరు తీసుకునే నిర్ణయాలలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఉన్నతాధికారుల అండదండలు మీకు లభిస్తాయి. పనులలో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయంలో లాభాలు పెరుగుతాయి.

కన్య: వృథా ప్రయాణాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతో మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడాలి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరిస్తారు.

 

తుల: శారీరక శ్రమ పెరుగుతుంది. ఉన్నతాధికారుల ప్రవర్తన నిరుత్సాహపరుస్తుంది. విహారయాత్రలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దైవదర్శనం చేసుకుంటారు.

వృశ్చికం: ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కష్టం వలన కార్యాలయంలో మీ సహ ఉద్యోగులకు కూడా ఉద్యోగ పరంగా చాలా మేలు జరుగుతుంది. మీ బంధువుల ప్రవర్తన కాస్త మనస్థాపాన్ని కలిగిస్తుంది.

ధనున్సు: కొన్ని కఠినమైన బాధ్యతల నుండి తప్పుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉన్నాయి.

 

మకరం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రతి విషయంలోనూ ఒక కొత్త ప్రణాళిక ఏర్పరచుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. నిశ్చింతగా వ్యవహరిస్తారు. స్వల్ప ధన లాభ సూచన.

కుంభం: పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలపరంగా పోటీదారులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ప్రతిస్పందించడం మంచిది కాదు.

మీనం: దూరప్రాంతాల నుంచి వచ్చిన వార్తలతో సంతోషం కలుగుతుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్య క్షేత్రాలు సందర్షిస్తారు. పట్టుదలతో ముందుకు సాగుతారు.