Ayodhya Ram temple: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రూ.1,800 కోట్లు..
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రూ. 1,800 కోట్ల అంచనా వ్యయం అవుతుందని నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ట్రస్టు అధికారులు తెలిపారు.
Ayodhya: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రూ. 1,800 కోట్ల అంచనా వ్యయం అవుతుందని నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ట్రస్టు అధికారులు తెలిపారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలపై ఏర్పడిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆదివారం జరిగిన సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించింది.
రామ మందిర నిర్మాణానికిరూ.1,800 కోట్లు ఖర్చవుతుందని ట్రస్ట్ అంచనా వేసింది. డిసెంబర్ 2023 నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని, జనవరి 2024లో జరిగే మకర సంక్రాంతి పండుగ నాటికి రాముడు గర్భగుడిలో ఉంటాడని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఆలయ సముదాయంలో ప్రముఖ హిందూ యోగులు, మరియు రామాయణ కాలం నాటి ప్రధాన పాత్రల విగ్రహాలు ఏర్పాటు చేయాలని కూడా ట్రస్ట్ నిర్ణయించిందన్నారు.
15 మంది ట్రస్టు సభ్యుల్లో 14 మంది సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి హాజరయినవారిలో నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా, ట్రస్ట్ చైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్, కోశాధికారి గోవింద్ దేవ్ గిరి, సభ్యుడు ఉడిపి పీఠాధీశ్వర్ విశ్వతీర్థ ప్రసన్నాచార్య, తదితరులు ఉన్నారు.