Fake currency: నకిలీ నోట్ల చలామణి.. వైఎస్సార్సీపీ మహిళా నేత అరెస్టు
వైఎస్సార్ కడప జిల్లాలో నకిలీ నోట్ల కలకలం రేపింది. అధికార పార్టీ కి చెందని మహిళా నేత, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్..
Fake currency : వైఎస్సార్ కడప జిల్లాలో నకిలీ నోట్ల కలకలం రేపింది. అధికార పార్టీ కి చెందని మహిళా నేత, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రసపుత్ర రజినీని దొంగనోట్ల చలామణి కేసులో బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.
రజినీ తో పాటు మరో వ్యక్తి చరణ్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె నుంచి రూ. 4 లక్షల దొంగనోట్లను గుర్తించారు.
తర్వాత రజినీ ఇచ్చిన సమాచారంతో మరో రూ. 44 లక్షల విలువ జేసే రూ. 500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రజినీ కి దొంగ నోట్లు వచ్చాయన్నది ఇపుడు చర్చనీయాంశమైంది. వైఎస్సార్ జిల్లాలో ప్రొద్దుటూరు, మైదుకూరు, దువ్వూరు పరిసర ప్రాంతాల్లో నకిలీ నోట్ల చలామణి విపరీతంగా జరిగింది.
ఇటీవల దొంగనోట్లను మారుస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే జిల్లాలోని నకిలీ నోట్ల వ్యవహారంలో రజినీ పాత్ర ఉందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
నకిలీ నోట్లను అనంతపురం లో పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి తక్కువకు కొనుగోలు చేసి బెంగళూరులో చలామణి చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
గతంలోనూ ఆరోపణలు
వైసీపీ కి చెందిన మహిళా నేత నకిలీ నోట్ల కేసులో పోలీసులకు చిక్కడం తీవ్ర చర్చనీయాంశమైంది. రజిని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వారు.
స్థానికంగా కీలకంగా వ్యవహరిస్తున్న ఆమెకు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు అండదండలు ఉన్నాయని సమాచారం. అదేవిధంగా రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ కు డైరెక్టర్ గా ఉన్నారు.
అయితే ఇటీవల ఆమె పదవీ కాలం ముగియగా.. మరోసారి పదివిని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రజినీపై గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చాయి. ప్రొద్దుటూరులో కొంతమంది నిరుద్యోగుల దగ్గర ఉద్యోగాల ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేశారని వాదనలు వినిపించాయి.
ఎమ్మెల్యే రాచమల్లు అండతోనే..
అయితే తాజాగా నకిలీ నోట్ల కేసులో రజినీ పాత్ర ఉండటంపై ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అధికార పార్టీ ఆగడాలకు అంతులేకుండా పోయిందన్నారు. స్థానికంగా అప్పులు చేసి ఐపీ పెట్టిన రజినీకి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బొందిలి కార్పొరేషన్ కు డైరెక్టర్ ను చేశారని ఆరోపించారు.
ఈ నకిలీ నోట్ల వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునని.. ఈ కేసు లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.
కాగా, రజినీ నకిలీ నోట్ల కేసు విషయంపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై తనకేమీ సంబంధం లేని ఆయన తెలిపారు.
ఒకవేళ రజినీ పాత్ర నిజమని తేలితే.. పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. తన పాత్రపై టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/