Last Updated:

Stock Market: స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. ఆర్బీఐ నిర్ణయమే కీలకం

దేశీ స్టాక్‌ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ఆరంభమయ్యాయి. మరికాసేపట్లో ఆర్బీఐ రేట్లపై కీలక నిర్ణయం ప్రకటించనుంది. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్ లో ప్రతికూల సంకేతాలు నెలకొన్నాయి. దీంతో మార్కెట్లు ప్రారంభంలోనే ఇన్వెసర్లు అప్రమత్తంగా ఉన్నారు.

Stock Market: స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. ఆర్బీఐ నిర్ణయమే కీలకం

Stock Market: దేశీ స్టాక్‌ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ఆరంభమయ్యాయి. మరికాసేపట్లో ఆర్బీఐ రేట్లపై కీలక నిర్ణయం ప్రకటించనుంది. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్ లో ప్రతికూల సంకేతాలు నెలకొన్నాయి. దీంతో మార్కెట్లు ప్రారంభంలోనే ఇన్వెసర్లు అప్రమత్తంగా ఉన్నారు.

సెన్సెక్స్ ఉదయం 9.19 కి 50 పాయింట్ల లాభంతో 63,193 దగ్గర ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 18,741 దగ్గర ట్రేడ్ అవుతోంది. డాలరుతో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 82.59 దగ్గర ప్రారంభమైంది.

సెన్సెక్స్ 30 సూచీలో పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ , హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ అండ్ టీ, మారుతీ, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, నెస్తే ఇండియా టైటన్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టెక్ మహీంద్రా, హెచ్ యూఎల్, బజాజ్ ఫిన్ సర్వ్, టీసీఎస్, హెచ్ సీఎల్ టెక్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్ , కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

 

నష్టాల్లో  ఆసియా- పసిఫిక్‌ సూచీలు(Stock Market)

బుధవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో స్థిరపడ్డాయి. ప్రస్తుతం అమెరికా స్టాక్‌ ఫ్యూచర్స్‌ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా- పసిఫిక్‌ సూచీలు ఈరోజు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ కెనడా వడ్డీ రేట్లను పెంచగా.. అమెరికా సైతం అదే బాటలో పయనించే అవకాశం ఉందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. వడ్డీరేట్ల పెంపుపై కేంద్ర బ్యాంకు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే దానిపై మదుపర్లు ప్రధానంగా దృష్టి సారించారు.