Tata Avinya: రేపటి కోసం.. టాటా నుంచి నెక్స్ట్ లెవల్ కార్.. లాంచ్ అయితే ఇంటదీ..!
Tata Avinya: ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టాటా మోటార్స్ అగ్రగామిగా ఉంది. దేశీయ మార్కెట్లో అనేక ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల విజయవంతంగా ముగిసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో అవిన్య X కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రదర్శించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ కారు అతి త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. రండి.. కొత్త టాటా అవిన్య X ఎస్‌యూవీ అంచనా ధర, స్పెసిఫికేషన్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించిన కొత్త టాటా అవిన్య X ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గ్రాండ్ ఎస్‌యూవీ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో వినూత్నమైన LED హెడ్‌లైట్లు, ‘T’ షేప్ ఎల్‌ఈడీ డీఆర్ఎలు, బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్, టెయిల్ లైట్లు ఉన్నాయి.
కొత్త టాటా అవిన్యా X ఎలక్ట్రిక్ SUV పవర్‌ట్రెయిన్ గురించి ప్రస్తుతం అధికారిక వివరాలు అందుబాటులో లేవు. ఈ కారు పవర్ ఫుల్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫుల్ ఛార్జింగ్‌తో ఇది 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించగలదని చెప్పవచ్చు.
కొత్త టాటా అవిన్య X కూడా మెరుగైన ఇంటీరియర్ డిజైన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది వివిధ ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ కారులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది మాత్రమే కాదు, ఇందులో డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ ఏసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయని చెబుతున్నారు.
ఈ ఎస్‌యూవీ గరిష్ట భద్రతను అందిస్తుంది. ప్రయాణీకుల రక్షణలో 6-ఎయిర్‌బ్యాగ్‌లు,యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, 360-డిగ్రీ కెమెరాలు ఉండచ్చు.
కొత్త టాటా అవిన్య X ఎలక్ట్రిక్ కారు ధర కొంచెం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం దీని ధర రూ. 30 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చు. ఈ కొత్త కారు రాబోయే కొన్ని నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
రాబోయే రోజుల్లో విడుదల కానున్న ‘టాటా అవిన్య ఎక్స్’ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లతో అమ్మకానికి రావడం దాదాపు ఖాయం. ఈ కారు చాలా మందికి కుటుంబ వాహనంగా ఎంపిక అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కొత్త అవిన్య SUV లాంచ్ అయిన తర్వాత దేశీయ కొనుగోలుదారుల నుండి సానుకూల స్పందన లభిస్తుందని భావిస్తున్నారు.