Last Updated:

Best Electric Cars: ఎలక్ట్రిక్ కార్లలో పంచ పాండవులు.. రేంజ్, స్పీడ్, కెపాసిటీలో వీటికి సరిలేరు..!

Best Electric Cars: ఎలక్ట్రిక్ కార్లలో పంచ పాండవులు.. రేంజ్, స్పీడ్, కెపాసిటీలో వీటికి సరిలేరు..!

Best Electric Cars: భారతీయ వినియోగదారులలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అనేక ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు తమ అనేక ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేస్తున్నాయి. భారతీయ మార్కెట్లో 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్‌లో ప్రయాణించగల ఎలక్ట్రిక్ కార్లు చాలానే అందుబాటులో ఉన్నాయి. అలాంటి 5 ఎలక్ట్రిక్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Mahindra BE 6
మహీంద్రా ఇటీవలే కొత్త ఎలక్ట్రిక్ SUV BE 6ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 59kWh, 79kWh రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఈ EV పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 682 కిమీ, చిన్న బ్యాటరీ ప్యాక్‌తో 535 కిమీ వరకు ప్రయాణించగలదు. ఈవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.90 లక్షలు.

Mahindra XEV 9e
మీరు మెరుగైన శ్రేణి కలిగిన EVని కొనాలనుకుంటే మహీంద్రా XEV 9e ఒక గొప్ప ఎంపిక. ఈ EV 79kWh, 59kWh రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఈ EV పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో 656 కిమీ, చిన్న బ్యాటరీ ప్యాక్‌తో 542 కిమీ వరకు రేంజ్ అందిస్తుంది. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ SUV ఎక్స్-షోరూమ్ ధర రూ.21.90 లక్షల నుండి రూ.30.50 లక్షల వరకు ఉంటుంది.

Tata Curvv EV
కొత్త EV కొనడానికి టాటా కర్వ్ కూడా ఒక గొప్ప ఎంపిక. ఈ EV కి 45kWh, 55kWh సామర్థ్యం గల 2 బ్యాటరీ ప్యాక్‌లు అందించారు. ఈ EV పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో 585 కిమీ, చిన్న బ్యాటరీ ప్యాక్‌తో 502 కిమీ పరిధిని అందిస్తుంది. కర్వ్ EV ధర రూ. 17.49 లక్షల నుండి రూ. 21.99 లక్షల మధ్య ఉంటుంది.

BYD eMax 7
BYD గత ఏడాది అక్టోబర్‌లో eMax 7ను రూ. 26.9 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేసింది. ఈ EV 71.8kWh బ్యాటరీ ప్యాక్‌తో 530 కిమీ. చిన్న 55.4kWh బ్యాటరీతో 420 కిమీ పరిధిని అందిస్తుంది.

Hyundai Creta Electric
హ్యుందాయ్ 2025 ఆటో ఎక్స్‌పోలో క్రెటా ఎలక్ట్రిక్‌ను విడుదల చేసింది. క్రెటా EV 2 బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఈ EV 42kWh బ్యాటరీతో 390 కిమీ, 51.4kWh బ్యాటరీతో 473 కిమీ పరిధిని అందిస్తుంది. క్రెటా EV ఎక్స్-షోరూమ్ ధర రూ.17.99 లక్షల నుండి రూ.23.50 లక్షల వరకు ఉంటుంది.