Xiaomi 15 Series: మూడు 50 MP కెమెరాలు.. షియోమి కొత్త ఫోన్లు వస్తున్నాయ్.. దీన్ని గుర్తుపెట్టుకోండి..!
Xiaomi 15 Series: స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమి గత సంవత్సరం చైనాలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో Xiaomi 15 Series ఫోన్లను విడుదల చేసింది. ఇప్పుడు ఈ సిరీస్ ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. నివేదికల ప్రకారం.. కంపెనీ ఈ సిరీస్ అల్ట్రా వేరియంట్‌ను కూడా విడుదల చేయనుంది. ఇది చైనాలోనూ లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీ ఇంకా వెల్లడికాలేదు. ఇంతలో ఈ రాబోయే ఫోన్ లైవ్ ఫోటోలు లీక్ అయ్యాయి. ఇవి వినియోగదారుల ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.
ఈ ఫోటోలను చూసినట్లయితే షియోమి 15 సిరీస్‌లోని ఇతర ఫోన్ల కంటే భిన్నంగా ఉందని చెప్పవచ్చు. దీనిలో కంపెనీ చతురస్రాకారానికి బదులుగా వృత్తాకార డిజైన్‌తో కెమెరా మాడ్యూల్‌ను అందించబోతోంది. లీకైన చిత్రం ప్రకారం.. ఫోన్ కెమెరా మాడ్యూల్‌లో మూడు లెన్స్‌లు ఉంటారు. ఫోన్ మెయిన్ సెన్సార్ 1 అంగుళం పరిమాణంతో 50-మెగాపిక్సెల్ లెన్స్‌గా కనిపిస్తుంది. ఇది కాకుండా, కంపెనీ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 3x జూమ్‌తో 50-మెగాపిక్సెల్ లెన్స్‌ను చేర్చవచ్చు. మునుపటి నివేదిక ప్రకారం ఫోన్‌లో అందించే లెన్స్‌లు LEICA బ్రాండింగ్‌తో వస్తాయి. ప్రత్యేకత ఏమిటంటే కంపెనీ 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కూడా అందించగలదు.
ఫోన్‌లో అందించే కెమెరా మాడ్యూల్ రెడ్ కలర్ ఔటర్ రింగ్‌ను కలిగి ఉంది. ఇక్కడ మీరు బ్లాక్ వీగన్ లెదర్ ప్యానెల్‌ను కూడా చూస్తారు. కంపెనీ 15 అల్ట్రాలో గ్లాస్, సిరామిక్ బ్యాక్ ప్యానెల్‌ను కూడా అందించవచ్చు. అయితే ఈ లీకైన లైవ్ ఫోటో, మునుపటి CAD రెండర్‌ల మధ్య ఖచ్చితంగా కొంత తేడా ఉంది. లీక్ అయిన లైవ్ ఫోటోలో లాగా, LEICA బ్రాండింగ్ నిలువుగా ఉంటుంది. CAD రెండర్లలో ఇది హారిజెంట్‌లా ఉంది. ఇది కాకుండా, రెండర్‌లలో చూపిన ఫోన్‌లో రెండు LED ఫ్లాష్‌లు ఉన్నాయి. అదే సమయంలో లీకైన లైవ్ ఫోన్‌లో కనిపించే ఫోన్ ఒకే LED ఫ్లాష్‌ను కలిగి ఉంది.
ఫీచర్ల గురించి మాట్లాడితే.. కంపెనీ ఈ ఫోన్‌లో 6.73-అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందిస్తుంది. ఇది మైక్రో-క్వాడ్-కర్వ్డ్ డిజైన్‌తో వస్తుంది. ఈ డిస్ప్లే 2K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్‌లో అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా చూడవచ్చు. ప్రాసెసర్‌గా కంపెనీ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌ను తీసుకురావచ్చు. ఈ ఫోన్ 16GB వరకు LPDDR5x RAM, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో రావచ్చు.
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ 6000mAh కావచ్చు, ఇది 100W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. OS విషయానికొస్తే, ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్‌ఓఎస్‌పై రన్ అవుతుంది. కంపెనీ ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కోసం 32-మెగాపిక్సెల్ కెమెరాను అందించనుంది. ఇది కాకుండా, వెనుక భాగంలో మీరు మూడు 50-మెగాపిక్సెల్ కెమెరాలు, 200-మెగాపిక్సెల్ సామ్‌సంగ్ HP9 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను చూడవచ్చు.