Tata Hydrogen Trucks: టాటా బ్రాండ్ అంటే ఇది సర్.. హైడ్రోజన్ ట్రక్కులు వచ్చేస్తున్నాయి.. రానున్న రోజుల్లో మొత్తం ఇవే..!
Tata Hydrogen Trucks: టాటా మోటార్స్ భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్-ఆధారిత వాణిజ్య వాహనం టాటా ప్రైమా హెచ్.28ని విడుదల చేసింది. ఇప్పుడు వీధుల్లోకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. టాటా మోటార్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) సంయుక్తంగా ఈ త్రైమాసికంలో హైడ్రోజన్-ఆధారిత ట్రక్కుల పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాయి.
హైడ్రోజన్ ట్రక్కుల రాక రవాణా రంగాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడటమే కాకుండా, పెట్రోల్, డీజిల్, సిఎన్‌జిపై భారతదేశం ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ ట్రక్కులు కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
నివేదికల ప్రకారం.. ఈ పైలట్ ప్రాజెక్ట్ 18 నెలల పాటు నడుస్తుంది. దేశంలోని జంషెడ్‌పూర్-కళింగనగర్, ముంబై-అహ్మదాబాద్, ముంబై-పూణే అనే మూడు మార్గాల్లో ట్రయల్ రన్ ప్రారంభమవుతుంది. టాటా మోటార్స్ ప్రకారం ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద, మూడు మార్గాల్లో దాదాపు 15 ట్రక్కులు నడవనున్నాయి. ఈ ప్రాజెక్ట్ హైడ్రోజన్‌ను సుదూర రవాణాకు అనువైన ఎంపికగా మార్చడానికి పని చేస్తుంది.
టాటా ప్రైమా హెచ్.28లో నాలుగు సిలిండర్ల హెచ్2ఐసీఈ ఇంజన్ ఉంది. ఇది 550 కిలోమీటర్ల మైలేజీని కలిగి ఉంటుంది. ఇందులోని ఇంజన్ పెట్రోల్, డీజిల్‌ను ఉపయోగించకుండా హైడ్రోజన్‌ను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ హైడ్రోజన్ ఇంజిన్‌లు, ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలపై పని చేస్తోంది. హైడ్రోజన్ ఆధారిత సాంకేతికతను వాణిజ్యపరంగా స్వీకరించడంలో ఇది సహాయపడుతుంది.
హైడ్రోజన్ ట్రక్కుల పరిచయంతో కార్బన్ ఉద్గారాలు దాదాపు సున్నాగా ఉంటాయి, పెట్రోల్, డీజిల్‌లకు బదులుగా స్వచ్ఛమైన శక్తిగా ఉంటుంది. ఇది ఇంధన దిగుమతులపై ఆధారపడకుండా భారతదేశానికి సహాయపడుతుంది, అయితే ఈ ప్రయాణం అంత సులభం కాదు.. ఎందుకంటే హోడ్రోజన్ ఉత్పత్తి, స్టోరేజ్ కష్టం.
ఇందుకోసం హైడ్రోజన్ ఇంధనం నింపే స్టేషన్లు, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రమే కాదు, హైడ్రోజన్‌తో నడిచే ఇంజన్‌లు ఇంకా అభివృద్ధి ప్రారంభ దశలోనే ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, చాలా మార్పులు ఇంకా రావాల్సి ఉంది. టాటా ప్రైమా హెచ్.28 హైడ్రాన్ ట్రక్కు ధర రూ.34.30 లక్షల నుండి రూ.39.50 లక్షల వరకు ఉండవచ్చు.