Published On:

Maruti Suzuki E Vitara Launching: ఈ కారు చూస్తే మీ పాత బండి ఏడుస్తుంది.. స్టెలిష్‌గా ఉంది.. సైలెంట్‌గా పోతుంది!

Maruti Suzuki E Vitara Launching: ఈ కారు చూస్తే మీ పాత బండి ఏడుస్తుంది.. స్టెలిష్‌గా ఉంది.. సైలెంట్‌గా పోతుంది!

Maruti Suzuki E Vitara Launching in May in India: మారుతి సుజుకి ఈ విటారా భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. మొదటిసారిగా, ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో దీనిని ప్రవేశపెట్టారు. దాని కాంపాక్ట్ సైజు, గొప్ప స్థలం కారణంగా కారు ప్రియులకు ఇది బాగా నచ్చింది. సిటీ డ్రైవింగ్‌కు సరైన మోడల్‌. విడుదలకు సంబంధించి కంపెనీ నుండి ఎటువంటి సమాచారం అందలేదు. నివేదికల ప్రకారం.. కొన్ని డీలర్‌షిప్‌లలో దాని బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ కారును రూ. 25,000 టోకెన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు బుకింగ్‌కు సంబంధించి కంపెనీ నుండి ఎటువంటి సమాచారం రాలేదు.

 

Maruti Suzuki E Vitara Price
నివేదికల ప్రకారం.. దీని ధర రూ. 16.99 లక్షల ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. కొత్త ఈ-విటారా నెక్సా బ్లూ, గ్రే, సిల్వర్, వైట్, రెడ్, బ్లాక్ సింగిల్-టోన్ రంగులలో అందుబాటులో ఉంది. వీటితో పాటు స్ప్లెండిడ్ సిల్వర్, ఒపులెంట్ రెడ్, ఆర్కిటిక్ వైట్ విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్, ల్యాండ్ బ్రీజ్ గ్రీన్ డ్యూయల్-టోన్ రంగుల్లో అందుబాటులో ఉంది. భారతదేశంలో, ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌తో పోటీ పడనుంది.

 

Maruti Suzuki E Vitara Battery
కొత్త ఈ విటారా రెండు బ్యాటరీ ప్యాక్‌లను పొందుతుంది – 49కిలోవాట్, 61కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. ఇవి 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంటాయని అంచనా. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా బ్యాటరీ ప్యాక్‌ను ఎంచుకోవచ్చు. ఈ-విటారా గుజరాత్ ప్లాంట్‌లో తయారవుతుంది. జపాన్, యూరప్‌లకు ఎగుమతి అవుతుంది. నెక్సా అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయిస్తుంది.

 

Maruti Suzuki E Vitara Ground Clearance
కొత్త ఈ విటారా 180మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా, దీని పొడవు 4,275మిమీ, వెడల్పు 1,800మిమీ, ఎత్తు 1,635మిమీ, వీల్‌బేస్ 2,700మిమీ, R18 ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్ ఇందులో కనిపిస్తాయి. ఇది ముందు, వెనుక లాంప్‌లో 3-పాయింట్ మ్యాట్రిక్స్ LED DRL ఉంది. దీనిలో అందించిన డ్రైవర్ సీటును 10 విధాలుగా సర్దుబాటు చేసుకోవచ్చు. భద్రత కోసం ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరాలు, లెవల్-2 అడాస్, EBDతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటాయి.