Home /Author Guruvendhar Reddy
Gorantla Madhav Arrested: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్ భార్య వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన చేబ్రోలు కిరణ్‌పై మాధవ్ దాడికి యత్నించాడు. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌ను మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరుకు తరలిస్తున్నారు. అయితే మంగళగిరి నుంచి గుంటూరు వరకు […]
Royal Challengers Bengaluru vs Delhi Capitals: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో ఇవాళ 24వ మ్యాచ్ జరగనుంది. బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య 31 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో బెంగళూరు 19 మ్యాచ్‌ల్లో గెలవగా.. […]
MS Dhoni back as CSK captain in IPL 2025: ఐపీఎల్ ఫ్రాంఛైజీ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీని మరోసారి కెప్టెన్‌గా ప్రకటించింది. ప్రస్తుతం కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ మోచేతి గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ తరుణంలో ఈ సీజన్లో మిగతా మ్యాచ్‌లకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగానే చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ ఫ్లెమింగ్ అధికారికంగా ప్రకటించాడు. […]
Government Report to Empowered Committee on Kancha Gachibowli: హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఎంపవర్డ్ కమిటీతో తాజ్‌కృష్ణలో తెలంగాణ ప్రభుత్వ అధికారులు భేటీ అయ్యారు. ఇందులో భాగంగా కంచ గచ్చిబౌలి భూములపై కమిటీ అధ్యయనం చేసింది. ఈ మేరకు కమిటీకి రాష్ట్ర సర్కార్ నివేదిక సమర్పించింది. ఎంపవర్డ్ కమిటీని సీఎస్ శాంతి కుమారి, పోలీస్ అధికారులు కలిశారు. కాగా, కంచ గచ్చిబౌలి భూముల విషయంలో హెచ్‌సీయూ భూవివాదం, ఇప్పటివరకు జరిగిన అంశాలపై […]
AP Government changes in Grama and Ward Sachivalayams: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వివిధ శాఖల కార్యదర్శులను ఆయా సచివాలయాలకు సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. కార్యదర్శులకు సాధారణ విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, 2,500 అంతకంటే తక్కువ జనాభా ఉన్న సచివాలయానికి ఇద్దరు సిబ్బంది కేటాయించింది. దీంతో పాటు […]
Tungaturthi congress MLA Samelu Insulted to Telangana CM: తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పటినుంచి వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయి. ఆయనను సీఎంగా ఎవరూ కూడా గుర్తించలేదనే వార్తలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవల అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా సక్సెస్ మీట్లో హీరో మరచిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో నెలరోజుల పాటు వార్ జరిగిన సంగతి తెలిసిందే. అలాగే, ఇది జరిగిన కొద్ది […]
Wine Shops will Closed Saturday Due to Hanuman Jayanthi: మందుబాబులకు బిగ్ అలర్ట్. ఏప్రిల్ 12న హైదరాబాద్ నగర వ్యాప్తంగా వైన్స్ బంద్ కానున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగాహైదరాబాద్, సికింద్రాబాద్ నగరవ్యాప్తంగా శనివారం మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఏప్రిల్ 12న ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 13న ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. అయితే మద్యం దుకాణాలతో పాటు […]
Police Filed Case On EX MLA Prakash Reddy: వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై కేసు నమోదైంది. జగన్ పర్యటనలో భాగంగా హెలీప్యాడ్ వద్ద తోపులాట చోటుచేసుకుంది. రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కారణంగా హెలికాప్టర్ వద్ద కార్యకర్తల తోపులాట జరిగిందని, ఈ తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ సత్యసాయి జిల్లా రామగిరి పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం […]
Donald Trump announces a 90-day pause on reciprocal tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాలను 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే చైనా తప్ప మిగతా 70 దేశాలపై ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అదే విధంగా చైనాపై సుంకాలను 104 శాతం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. చైనా ప్రపంచ మార్కెట్లను అగౌరవపరిచిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. […]
Royal Challengers Bengaluru vs Delhi Capitals: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ 24వ మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో స్థానంలో ఉంది. అయితే, ఈ రెండు జట్లలో ఏ జట్టు భారీగా గెలిచినా అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. కాగా, […]