Kancha Gachibowli: ముగిసిన ఎంపవర్డ్ కమిటీ భేటీ.. నివేదిక అందజేసిన తెలంగాణ సర్కార్

Government Report to Empowered Committee on Kancha Gachibowli: హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఎంపవర్డ్ కమిటీతో తాజ్‌కృష్ణలో తెలంగాణ ప్రభుత్వ అధికారులు భేటీ అయ్యారు. ఇందులో భాగంగా కంచ గచ్చిబౌలి భూములపై కమిటీ అధ్యయనం చేసింది. ఈ మేరకు కమిటీకి రాష్ట్ర సర్కార్ నివేదిక సమర్పించింది. ఎంపవర్డ్ కమిటీని సీఎస్ శాంతి కుమారి, పోలీస్ అధికారులు కలిశారు.
కాగా, కంచ గచ్చిబౌలి భూముల విషయంలో హెచ్‌సీయూ భూవివాదం, ఇప్పటివరకు జరిగిన అంశాలపై అధికారులు వివరణ అందించారు. అలాగే ప్రభుత్వం తీసుకున్న చర్యలను కమిటీకి సీఎస్ వివరించారు. అలాగే హెచ్‌సీయూ విద్యార్థి సంఘాలత ఎంపవర్డ్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి ఏబీవీపీ సహా పలు విద్యార్థి సంఘాలు హాజరయ్యాయి. తమ దగ్గరున్న ఆధారాలను విద్యార్థులు సమర్పించారు.
అయితే, ఏఐ క్రియేషన్ అంటున్న వీడియోలనూ కమిటీకి విద్యార్థులు చూపించారు. అలాగే ఎంపవర్డ్ కమిటీని మాజీ మంత్రి హరీష్ రావు టీమ్ కలిసింది. కంచ గచ్చిబౌలి భూములపై కమిటీకి బీఆర్ఎస్ నివేదిక సమర్పించింది. 50 బుల్డోజర్లను పెట్టి చెట్లను ఊచకోత కోశారన హరీష్ రావు ఆరోపించారు. 400 ఎకరాల భూమిని కేంద్ర కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
అంతకుముందు, ఈ భూముల విషయంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా సమగ్ర నివేదిక అందజేయాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ హెచ్‌సీయూ భూములను పరిశీలించింది. కమిటీలో చైర్మన్ సిద్ధాంత దాస్, మరో ఇద్దరు సభ్యులు ఉన్నారు.