Home /Author anantharao b
హైదరాబాద్ లో సోషల్ మీడియా సంచలనం గా మారిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మంగళవారం ఆమె దుకాణాన్ని మూసివేయించిన పోలీసులు వేరే చోటకు మార్చాలని ఆదేశించిన విషయం తెలిపింది. అయితే తాజాగా ప్రభుత్వం అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ కొనసాగించుకోవచ్చని తెలిపింది.
లావణ్య డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. షార్ట్ ఫిల్మ్‌లో నటించే లావణ్య మత్తుకు బానిస అయి చివరికి పోలీసులకు పట్టుబడింది. ఏపీలోని విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య చదువుకోసం హైదరాబాద్ వచ్చింది. గండిపేట మండలం కోకాపేటలో సోదరుడితో కలిసి నివాసం ఉంటోంది.
ఏపీకి చెందిన ఓ మహిళ ఇటీవల ఢిల్లీలోని హోటల్లో బస చేసి బిల్లు కట్టే సమయంలో మోసం చేయటంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను విచారించగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె బ్యాంకు ఖాతాలో కేవలం 41 రూపాయలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీలోని ఏరోసిటీలో ఉన్న పుల్మాన్ హోటల్లో ఝాన్సీరాణి గత డిసెంబర్లో 15 రోజులు ఉండడానికి గదిని బుక్‌చేశారు.
చండీగఢ్ మేయర్ ఎన్నికలో అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీజేపీకి చెందిన మనోజ్ సోంకార్ విజేతగా నిలిచారు. మొత్తం 36 ఓట్లకు గాను 16 ఓట్లు బీజేపీ దక్కించుకోగా ఆప్ పార్టీకి 12 ఓట్లు పోలయ్యాయి. ఎనిమిది ఓట్లు చెల్లని ఓట్లుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ అనిల్ మాసి తేల్చడంతో ఆప్ పార్టీ బీజేపీపై మండిపడుతోంది.చండీగడ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్‌లు రెండు కలిసి పోటీ చేశాయి.
ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం మావోస్టులకు భద్రతా దళాలకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా.. మరో పద్నాలుగుమంది జవాన్లు గాయపడ్డారు.ఇదే ప్రాంతంలో 2021 నుంచి ఇప్పటి వరకు సుమారు 23 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఐజీ బస్తర్ పి సుందర్రాజ్ చెప్పారు.
తెల్లాపూర్‌లో దివంగత విప్లవ గాయకుడు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.విగ్రహానికి అవసరమైన భూమిని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారిక ప్రకటనలో తెలియజేసింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సత్యవేడు ఎమ్మల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం తెలుగుదేశం జాతీయపార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. ఆయనకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్యవేడు నుంచి పోటీ చేయడానికి టికెట్ దక్కలేదు. దీనికి ప్రతిగా తిరుపతి నుంచి ఎంపీగా పోటీచేయమని చెప్పడంతో ఆయన షాక్ అయ్యారు.
ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది.పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్, వైస్ చైర్మన్ షా మహమూద్ ఖురేషీలకు సైఫర్ కేసులో పాకిస్థాన్‌లోని ప్రత్యేక కోర్టు మంగళవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది.
తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీఖాన్ ల ప్రమాణస్వీకారానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు వీరిచేత ప్రమాణస్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సమరశంఖాన్ని పూరించింది. ఇందులో భాగంగా శనివారం భీమిలి నియోజక వర్గం సంగివలస సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. సీఎం జగన్ ఈ సభకు హాజరై క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేసారు. రాబోయే ఎన్నికల యుద్దంలో ప్రతిపక్షాలు ఎన్ని వచ్చినా తాను సిద్దంగా ఉన్నానంటూ చెప్పారు. నేను సిద్దం మీరు సిద్దమా అంటూ కార్యకర్తలను ప్రశ్నించారు.