Gaddar Statue: తెల్లాపూర్ లో గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ
తెల్లాపూర్‌లో దివంగత విప్లవ గాయకుడు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ హైదరాబాద్ మున్సిపల్ డెవలప్‌మెంట్ అథారిటీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.విగ్రహానికి అవసరమైన భూమిని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారిక ప్రకటనలో తెలియజేసింది.

Gaddar Statue: తెల్లాపూర్‌లో దివంగత విప్లవ గాయకుడు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ హైదరాబాద్ మున్సిపల్ డెవలప్‌మెంట్ అథారిటీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.విగ్రహానికి అవసరమైన భూమిని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారిక ప్రకటనలో తెలియజేసింది.
తెలంగాణ ఉద్యమ గొంతు..(Gaddar Statue)
1949లో జన్మించిన గద్దర్ నక్సల్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. దళితులు, వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాదానికి గద్దర్ తన మద్దతును ఇచ్చారు. తెలంగాణ సాంస్కృతిక మరియు రాజకీయ రంగాల్లో ప్రముఖ వ్యక్తిగా, జానపద సంగీతానికి చేసిన కృషి చేసిన వ్యక్తిగా గద్దర్ ప్రసిద్ధి చెందారు.తెలంగాణ ఉద్యమ గొంతుకగా, ప్రజా యుద్దనౌకగా గద్దర్ నిలిచిపోయారు. గద్దర్ ఆగస్టు 6, 2023న 74 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
ప్రజా యుద్ధ నౌక ‘గద్దర్’ విగ్రహ ఏర్పాటుకు అనుమతించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మాణాన్ని ఆమోదించిన @HMDA_Gov.
అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
— Telangana CMO (@TelanganaCMO) January 30, 2024