Home /Author anantharao b
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ ఫలితాలను విడుదల చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 3వేల7వందల 43 పరీక్ష కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. ఇందులో మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా.. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు
హైదరాబాద్ పోలీసు కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోని మొత్తం సిబ్బందిని మార్చివేసారు. . ఇన్ స్పెక్టర్ నుంచి హోంగార్డు వరకు మొత్తం 85 మంది సిబ్బందిని హైదరాబాద్ బదిలీ చేశారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏపీ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణికం ఠాగూర్ పరువు నష్టం దావా నోటీసులు పంపారు. 7 రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే కోర్టుకు వెళ్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎంపిక విషయంలో మాణికం ఠాగూర్‌పై బీఆర్ఎస్ నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో ఆయన పరువు నష్టం నోటీసులు పంపించారు.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ కమిషనరేట్ కానిస్టేబుల్ నాగమణి ఆందోళన చేపట్టారు. సివిల్ తగాదాల్లో తలదూర్చుతున్న మేడిపల్లి ఎస్సై శివకుమార్ తమ ఇంటిని కబ్జా చేస్తున్నారంటూ ఆరోపించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ కబ్జాదారులకు సహకరిస్తున్న ఎస్సై శివకుమార్ పై కనీసం దర్యాప్తు చేయకుండా కేసులు నమోదు చేస్తున్నారంటూ ఆందోళన చేశారు.
తోషాఖానా కేసుకు సంబంధించి పాకిస్తాన్ కోర్టు మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు ఆయన భార్యకు బుష్రాబీబీకి 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఈ జంట పది సంవత్సరాల వరకు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. దీనితో పాటు వీరిద్దరు 78.7 కోట్ల రూపాయలు జరిమనా విధించింది. ఇదిలా ఉండగా మంగళవారం నాడు పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు పిటిఐ వ్యవస్థాపకుడు మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌కు, ఆయన మంత్రివర్గంలో విదేశాంగమంత్రిగా పనిచేసిన షా మహ్మద్ ఖురేషిని అధికార రహస్యాల చట్టం కింది పదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా అవినీతి రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో డెన్మార్క్ అవినీతి రహిత దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అత్యంత అవినీతి కలిగిన దేశాల్లో సోమాలియా 11 స్కోరుతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్ 39 స్కోరుతో మొత్తం 180 దేశాల్లో 93వ స్థానంలో నిలిచింది.
అయోధ్యలో రామమందిరం ప్రారంభాన్ని ఖండిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ కుమార్తె సురణ్య అయ్యర్‌ను ఢిల్లీలోని జంగ్‌పురాలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ( ఆర్ డబ్ల్యుఎ) తన ఇంటి నుండి బయటకు వెళ్లమని కోరింది.
లడఖ్‌లో చైనా సైన్యం చొరబాట్లు పెరుగుతుండటంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా సైన్యం గస్తీ తిరుగుతూ ఆ ప్రాంతంలోని గొర్రెల కాపరులతో వాగ్వాదానికి దిగిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
వారణాసి కోర్టు బుధవారం హిందూ భక్తులను జ్ఞాన్వాపి మసీదులో సీలు చేసిన నేలమాళిగలో పూజలకు అనుమతించింది. కోర్టు ఆదేశం ప్రకారం, హిందూ భక్తులు ఇప్పుడు వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు లోపల మూసివున్న 'వ్యాస్ కా టెఖానా'లో ప్రార్థనలు చేయవచ్చు. అంతకుముందు రోజు విచారణ సందర్భంగా రాబోయే ఏడు రోజుల్లో అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బుధవారం పశ్చిమ బెంగాల్లో తిరిగి ప్రవేశిస్తున్న సమయంలో కొందరు దుండగులు దాడి చేశారు. రాహుల్ గాంధీ బెంగాల్లోకి ప్రవేశించినప్పుడు, అతని కారుపై ఇటుకలు విసరడంతో అతని వాహనం బాగా దెబ్బతింది.వాహనం వెనుక అద్దం ధ్వంసమైనా రాహుల్ గాంధీకి ఎలాంటి గాయాలు కాలేదు.ఈ ఘటన మాల్దాలో చోటుచేసుకుంది.