Home /Author anantharao b
బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్‌ను హత్య చేసిన కేసులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి చెందిన 15 మంది వ్యక్తులకు మరణశిక్ష విధిస్తూ కేరళ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 డిసెంబర్లో రంజిత్ హత్యకు గురయ్యారు.
ఢిల్లీలోని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికారిక నివాసంలో జరిగిన సోదాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండు బీఎండబ్ల్యూలు, కొన్ని నేరారోపణ పత్రాలు, రూ.36 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. సోరెన్ ఇంట్లో లేనందున ఈడీ బృందం అతన్ని ప్రశ్నించలేకపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం -యూఏపీఏ కింద సిమిపై నిషేధాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది.
నెల్లూరు జిల్లాలోని నారాయణ గ్రూప్ విద్యార్థుల కుటుంబ సభ్యుల డేటాను సేకరిస్తోందని ని ఫిర్యాదు చేస్తూ వైఎస్సార్సీపీ ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేసింది.వివిధ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు వృత్తిపరమైన కళాశాలలతో కూడిన నారాయణ విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా రంగంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నాయి. వారి విద్యా సంస్థల్లో నమోదు చేసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యుల నుండి వ్యక్తిగత డేటా సేకరణలో నిమగ్నమై ఉన్నాయని తెలిపింది.
సోమవారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 5 కోట్ల 141 లక్షల అంచనాతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్ కి ఆమోదం తెలిపింది. పాలక మండలి నిర్ణయాలను చైర్మన్ కరుణాకర్ రెడ్డి వివరించారు.
రష్యాతో యుద్ధానికి 100,000 మోర్టార్ షెల్స్‌ను కొనుగోలు చేసేందుకు కేటాయించిన దాదాపు 40 మిలియన్ డాలర్లను పక్కదారిపట్టించడానికి ఉక్రెయిన్ ఆయుధ సంస్థ ఉద్యోగులు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి కుట్ర పన్నారని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ తెలిపింది.
ఆఫ్రికాలోని చమురు సంపన్న ప్రాంతమైన అబేయిలోని గ్రామస్థులపై ముష్కరులు దాడి చేశారు.ఈ దాడిలో యునైటెడ్ నేషన్స్ శాంతి పరిరక్షకుడితో సహా 52 మంది మరణించగా 64 మంది గాయపడ్డారని ప్రాంతీయ అధికారి తెలిపారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన అంశాలపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తన నిర్ణయాన్ని వెల్లడించేందుకు సుప్రీంకోర్టు సోమవారం గడువును పొడిగించింది.
15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 56 మంది సభ్యుల పదవీకాలం ఏప్రిల్ లో ముగియనుంది.
: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం నాయుడుకు ఉపశమనం కల్పిస్తూ జనవరి 10న హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.