Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు జవాన్ల మృతి..
ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం మావోస్టులకు భద్రతా దళాలకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందగా.. మరో పద్నాలుగుమంది జవాన్లు గాయపడ్డారు.ఇదే ప్రాంతంలో 2021 నుంచి ఇప్పటి వరకు సుమారు 23 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఐజీ బస్తర్ పి సుందర్‌రాజ్ చెప్పారు.
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం మావోస్టులకు భద్రతా దళాలకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందగా.. మరో పద్నాలుగుమంది జవాన్లు గాయపడ్డారు.ఇదే ప్రాంతంలో 2021 నుంచి ఇప్పటి వరకు సుమారు 23 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఐజీ బస్తర్ పి సుందర్‌రాజ్ చెప్పారు.
హిడ్మాకు పట్టున్న ప్రాంతం..(Chhattisgarh Encounter)
బీజాపూర్ జిల్లాలోని టేకులగూడెం గ్రామంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగంది. బీజాపూర్.. సుక్మాజిల్లా సరిహద్దులో ఉంది ఈ గ్రామం. మావోయిస్టులకు కీలక ప్రాంతంగా భావిస్తున్న ఈ ప్రాంతంలో భద్రతా దళాలకు సాయంగా కోబ్రా కమాండోలు వెళ్లారు. అదే సమయంలో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. మావోయిస్టులను తమ కమాండోలు ధీటుగా ఎదుర్కొన్నారని చెప్పారు. అయితే ముందుగా అంచనా వేసిన దాని కంటే గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండవచ్చునని అధికారులు చెబుతున్నారు. కాగా మావోయిస్టులకు టేకులగూడెం అత్యంత పటిష్టమైన ప్రాంతం అని మావోయిస్టు కీలక నేత మాడ్వీ హిడ్మాకు కూడా ఇక్కడ బాగా పట్టు ఉందని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో జరిగే ప్రతి దాడి వెనుక హిడ్మా హస్తం ఉందంటున్నారు అధికారులు. 2013 జూన్‌లో కాంగ్రెస్ నాయకుడు జీరామ్ గాటిని ఇక్కడే మావోస్టులు ఊచకోత కోశారని ఐజీ బస్తర్ పీ సుందర్‌రాజ్ గుర్తు చేశారు.