Home /Author anantharao b
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మీడియాకు అండగా ఉండి వారి కష్టాల్లో పాలుపంచుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ వెంట జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు.
భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు మొదటి సర్వీసును 2026లో నడిపే అవకాశం ఉందని కేంద్ర రైల్వే మరియు ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం తెలిపారు. ఒక వార్తాసంస్దకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్టాడుతూ అహ్మదాబాద్-ముంబై మార్గంలో బుల్లెట్ రైళ్ల పనులు చాలా బాగా జరుగుతున్నాయని చెప్పారు.
తైవాన్ తూర్పు తీరంలో 24 గంటల వ్యవధిలో 6.3 తీవ్రతతో 80 భూకంపాలు సంభవించాయి. సోమవారం రాత్రి నుండి మంగళవారం తెల్లవారుజాము వరకు సంభవించిన ఈ భూకంపాల ప్రభావంతో దేశ రాజధాని తైపీలో పలు భవనాలు కంపించి దెబ్బతిన్నాయని తైవాన్ వాతావరణ విభాగం తెలిపింది.
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 అనకొండలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని అరెస్టు చేశారు. బెంగళూరు కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారులు బ్యాంకాక్ నుండి వచ్చిన ప్రయాణికుడిని అడ్డగించి అరెస్టు చేసామని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్‌లో చెప్పారు. విచారణ జరుగుతోంది. వన్యప్రాణుల అక్రమరవాణాను సహించబోమని తెలిపారు.
మలేసియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఆకాశంలో ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏకంగా 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
సీఎం జగన్ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని, కేసుల పేరుతో టీడీపీ నేతలను వేధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో టీడీపీ చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యం నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
ఉద్యోగాల కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్ల్యుబిఎస్సిసి పాఠశాల ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన 2016 రిక్రూట్మెంట్ ప్యానెల్ మొత్తాన్ని కలకత్తా హైకోర్టు సోమవారం రద్దు చేసింది. సుమారుగా 24,000 ఉద్యోగాలను కోర్టు రద్దు చేసింది. వీటిలో బెంగాల్‌లోని వివిధ రాష్ట్ర-ప్రభుత్వ ప్రాయోజిత మరియు ఎయిడెడ్ పాఠశాలలకు 2016లో ప్రవేశ పరీక్ష ద్వారా నియమించబడిన బోధన, బోధనేతర సిబ్బంది యొక్కనియామకాలు ఉన్నాయి.
14 ఏళ్ల అత్యాచార బాధితురాలు తన 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు అసాధారణ తీర్పును వెలువరించింది. దీనికి వ్యతిరేకంగా బాంబే హైకోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టు కొట్టివేసింది. మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై గర్బం దాల్చింది. ఈ విషయం తల్లికి తెలియడంతో ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించింది.
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ఇంకా పూర్తికాకుండానే బీజేపీ బోణీ కోట్టేసింది. గుజరాత్ లోని సూరత్ లోక్‌సభ సీటును ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న నీలేష్ కుంభానీ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. పోటీలో మిగిలిన అభ్యర్దులు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్ది ముఖేష్ దలాలీ ఏకగ్రీవంగా గెలుపొందారు.
రేపు హైదరాబాద్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా వైన్స్ బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడువల చేసారు