Last Updated:

iQOO 13: ఐక్యూ వచ్చేస్తోంది.. మతిపోగొడుతున్న లీక్స్..!

iQOO 13: ఐక్యూ వచ్చేస్తోంది.. మతిపోగొడుతున్న లీక్స్..!

iQOO 13: ఐక్యూ తన కొత్త ఫోన్ iQOO 13 ను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్ వార్తల్లో నిలుస్తోంది. గత వారం కంపెనీ ఈ ఫోన్ ఫ్రంట్ లుక్‌ను విడుదల చేసింది. కంపెనీ ఫోన్‌లో BOE Q10 డిస్‌ప్లేను అందించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్లిమ్ బెజెల్స్, సెంటర్ పంచ్-హోల్‌ను కలిగి ఉంది. ఇప్పటి వరకు కంపెనీ దీని ఒరిజినల్ ఫోటోను షేర్ చేయలేదు. అయితే ఈ ఫోన్ రియల్ ఫోటోస్  చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో కనిపించాయి. ఈ ఫోన్  ఫ్రంట్ లుక్ వీటిలో చూడవచ్చు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

ఈ ఫోటోలలో మీరు మినిమల్ బెజెల్స్‌తో ఫోన్ ఫ్రంట్ లుక్‌ను చూడచ్చు. ఫోన్ ఫ్రంట్ లుక్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ లాగా ఉంది. ఫోన్ వైపులా ఇచ్చిన ఫ్లాట్ ఫ్రేమ్‌లు యాంటెన్నా లైన్‌లతో వస్తాయి. ఈ ఫోన్‌ని మెటల్‌తో బాడీతో తయారు చేశారు. ఫో రైట్ ప్యానెల్ గురించి మాట్లాడితే ఇక్కడ మీరు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్‌ని చూస్తారు.

కంపెనీ ఈ ఫోన్‌లో 6.82 అంగుళాల 2K LTPO AMOLED డిస్‌ప్లేను అందించనుంది. ఇది 144Hz రి్రష్ రట్‌కు సపోర్ట్ ఇస్తుంది. మెరుగైన కంటి రక్షణతో పాటు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో ఈ డిస్‌ప్లేను కంపెనీ అందించబోతోంది. Weiboలో షేర్ చేసిన ఫోటోలో ఫోన్ బ్యాక్ లుక్ కనిపించలేదు. అయితే మునుపటి లీక్‌లలో దీనికి బ్యాక్ ప్యానెల్ ఉన్నట్లు కనిపిస్తుంది. దీని ప్రకారం ఫోన్ IQOO 12ని పోలి ఉంటుంది.

కంపెనీ ఫోన్ వెనుక ప్యానెల్‌కు ఎగువ ఎడమవైపున స్విర్ల్ కెమెరా ఐలాండ్‌ను అందించబోతోంది. విశేషమేమిటంటే కొత్త వేరియంట్‌లో మీరు RGB లైటింగ్ – హాలో లైట్‌ను కూడా చూడవచ్చు. iQoo 13 ఈ నెలాఖరులో చైనాలో ప్రారంభమవుతుంది. లీక్స్ నిజమైతే ఈ ఫోన్ అక్టోబర్ 30 న మార్కెట్లోకి రావచ్చు. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర దాదాపు రూ.55 వేలు ఉండవచ్చు.