Mumbai Rains: ముంబైలో భారీ వర్షాలు..విమానాలు, రైళ్లు నిలిపివేత
గత 24 గంటలుగా కురుస్తున్నభారీ వర్షాలతో ముంబై అతలాకుతలమయింది. పలు ప్రాంతాలు జలమయవమగా సబర్బన్ రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా 50కి పైగా విమానాలు రద్దు అయ్యాయి. భారత వాతావరణ శాఖ ముంబై, థానే, పాల్ఘర్ మరియు కొంకణ్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Mumbai Rains: గత 24 గంటలుగా కురుస్తున్నభారీ వర్షాలతో ముంబై అతలాకుతలమయింది. పలు ప్రాంతాలు జలమయవమగా సబర్బన్ రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా 50కి పైగా విమానాలు రద్దు అయ్యాయి. భారత వాతావరణ శాఖ ముంబై, థానే, పాల్ఘర్ మరియు కొంకణ్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
స్కూళ్లు, కళాశాలలు మూసివేత..( Mumbai Rains)
వర్షాల కారణంగా ముంబై నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ , మున్సిపల్ పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడ్డాయి.వర్లీ, బుంటారా భవన్, కుర్లా ఈస్ట్, ముంబైలోని కింగ్స్ సర్కిల్ ప్రాంతం, దాదర్ మరియు విద్యావిహార్ రైల్వే స్టేషన్లలో నీరు నిలిచిపోయింది. ముంబై, థానే, పాల్ఘర్ మరియు రాయ్‌గడ్‌లలో ప్రతిరోజూ 30 లక్షల మంది ప్రయాణికులు సబర్బన్ లోకల్ రైలు సేవలను ఉపయోగిస్తున్నారు.అట్గావ్ మరియు థాన్‌సిత్ స్టేషన్ల మధ్య ట్రాక్‌లపై మట్టి చేరడంతో థానే జిల్లాలోని కసర మరియు టిట్వాలా స్టేషన్ల మధ్య రైలు సేవలను నిలిపివేసారు. రద్దీగా ఉండే కళ్యాణ్-కసర మార్గంలో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంబైలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో నీటిని తొలగించడానికి, సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను థానే, వసాయి (పాల్ఘర్), మహద్ (రాయ్‌గడ్), చిప్లున్ (రత్నగిరి), కొల్హాపూర్, సాంగ్లీ, సతారా ఘట్కోపర్, కుర్లా మరియు సింధుదుర్గ్‌లలో మోహరించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మహారాష్ట్రలోని థానేలో నీటిలో మునిగిపోయిన రిసార్ట్ నుండి 49 మందిని, పాల్ఘర్లో 16 మంది గ్రామస్థులను రక్షించారు.