NTA Tells Supreme Court: నీట్ పరీక్ష రద్దు చేస్తే విద్యార్దులు నష్టపోతారు: సుప్రీంకోర్టులో ఎన్టీఏ అఫిడవిట్
నీట్ పేపర్ లీక్ ఘటనలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ జరుపుతోందని, దీనికి సంబంధించి పలు అరెస్టులు జరిగాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సుప్రీంకోర్టుకు తన అఫిడవిట్లో తెలిపింది.
NTA Tells Supreme Court: నీట్ పేపర్ లీక్ ఘటనలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ జరుపుతోందని, దీనికి సంబంధించి పలు అరెస్టులు జరిగాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సుప్రీంకోర్టుకు తన అఫిడవిట్లో తెలిపింది. పేపర్ లీక్ ఘటన వెనుక వ్యవస్థీకృత సంబంధం ఉందా అనే కోణంలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తోంది.పేపర్ లీక్ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నప్పటికీ పరీక్షను రద్దు చేయడం సాధ్యం కాలేదని తెలిపింది.
పరీక్ష రద్దు హేతుబద్దం కాదు..(NTA Tells Supreme Court)
దేశవ్యాప్తంగా జరిగిన పరీక్షలో ఉల్లంఘనలు జరిగాయని రుజువు లేనప్పుడు, మొత్తం పరీక్ష మరియు ఫలితాలను రద్దు చేయడం హేతుబద్ధం కాదని కూడా ఎన్టీఏ తన అఫిడవిట్లో పేర్కొంది. పరీక్షకు పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థుల ప్రయోజనాలకు హాని కలిగించకూడదని తెలిపింది. పరీక్షను పూర్తిగా రద్దు చేయడం వల్ల లక్షలాది మంది నిజాయితీ గల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని ఎన్టీఏ కోర్టుకు తెలిపింది.రీక్షల పవిత్రతను నిర్ధారించడానికి మరియు విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపింది. దీనికి సంబంధించి కేంద్రం చేసిన చట్టం జూన్ 21నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది.మే 5న జరిగిన పరీక్షలో అవకతవకలు జరిగాయని, మళ్లీ మళ్లీ నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జులై 8న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.